"రాసి పెట్టుకోండి..నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా".. సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్ డార్లింగ్..!

Thota Jaya Madhuri
ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. ఇన్నాళ్లు ప్రభాస్ అంటే ఓ పాన్ ఇండియా హీరో ..స్టార్ హీరో అనుకున్నారు. కానీ ప్రభాస్ లో కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంది అన్న విషయాన్ని బయట పెట్టారు . తాజాగా ప్రభాస్ సెన్సేషనల్ వీడియో ని రిలీజ్ చేశారు . ఆ వీడియోలో ఆయన సారీ చెప్పడంతో పాటు అభిమానులకు బిగ్ ప్రామిస్ కూడా చేయడం సంచలనంగా మారింది . మనకు తెలిసిందే ప్రభాస్ కి ప్రపంచ దేశాలలో ఫ్యాన్స్ ఉన్నారు . మరి ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


బాహుబలి సినిమా జపాన్లో ఫస్ట్ రిలీజ్ అయిన తెలుగు సినిమా . ఆ తర్వాత చాలా సినిమాలు జపాన్ లో రిలీజ్ సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి.  తాజాగా ఆ లిస్ట్ లోకి రాబోతుంది కల్కి 2898 ఏడి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే హీరోయిన్గా నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. నాగ్ అశ్వీన్ దర్శకత్వం ఈ సినిమాకి హైలైట్ గా మారింది . వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్వీన్ ఈ సినిమాను నిర్మించారు .


ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది . కాగా ఇప్పుడు ఈ సినిమా జపాన్లో కూడా రిలీజ్ కాబోతుంది . జనవరి మూడవ తేదీ జపాన్లో "కల్కి" సినిమా రిలీజ్ కాబోతుంది.  ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. " థాంక్యూ సో మచ్ ..నా మీద మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను ..కానీ మీ అందరికీ ముందుగా సారీ చెప్తున్నాను ..నేను ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను జపాన్ కి రావాలి అని ..కానీ కుదరడం లేదు ..నా ఆరోగ్యం కూడా బాగోలేదు . నా కాళ్ళకి గాయమైన కారణంగా నేను ఎక్కడికి రాలేకపోతున్నాను . జపాన్లో నా సినిమా రిలీజ్ చేస్తున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు . సినిమా చూడండి మీకు నచ్చుతుంది బాగా ఎంజాయ్ చేస్తారు.  ప్రామిస్ కచ్చితంగా నేను త్వరలోనే  జపాన్ వస్తాను".. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత్తం ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ - అనుష్క లు ప్ర్ళ్ళి చేసుకుంటే చూడాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. చూద్దాం మరి ఎప్పటికి ఆ కోరిక నెరవేరుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: