నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఊర్వశి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ఈ మూవీ లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే బాలయ్య ప్రస్తుతం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ టాక్ షో నెక్స్ట్ ఎపిసోడ్ కి విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఇలా సంక్రాంతికి తన సినిమాతో పోటీగా విడుదల కాబోతున్న సినిమాకు బాలయ్య సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఇటు బాలయ్య , అటు వెంకీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.