మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తారా.. ఆ సినిమా పేరు చెప్పి క్లారిటీ ఇచ్చాడుగా!
మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో సీఎం రోల్ లో నటించి ఆ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే సైనికుడు సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినా ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మహేష్ బాబు ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్నకు తాను నటించిన సైనికుడు మూవీ వారం రోజులు కూడా ఆడలేదని రాజకీయాల్లో సక్సెస్ కావడం సులువు కాదని చెప్పకనే చెప్పేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి సినిమాకే పరిమితమైన మహేష్ బాబు ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని తెలుస్తోంది. మహేష్ బాబు తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నారు. సినిమా సినిమాకు మహేష్ బాబు అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. రాజమౌళి సినిమాతో మహేష్ కు క్రేజ్ పెరగడం పక్కా అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.