అమాంతం పడిపోయిన పుష్ప.. ఆ మీడియం రేంజ్ హీరో కలెక్షన్లను కూడా దాటలేకపోయిందే..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో అద్భుతమైన కలెక్షన్లను ఈ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇకపోతే 13 వ రోజు మాత్రం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కలెక్షన్లు రాలేదు. కాకపోతే 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల లిస్టులో ఈ మూవీ మంచి స్థానంలో నిలిచింది.

విడుదల అయిన 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 4.68 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ప్రతి రోజు పండగే సినిమా 2.91 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 2.54 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 1 సినిమా 1.98 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.

ఇక పుష్ప పార్ట్ 2 మూవీ 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.88 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది. ఇలా విడుదల అయిన 13 వ రోజు పుష్ప పార్ట్ 2 మూవీ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త పడిపోయిన ఈ మూవీ ఓవరాల్ గా 13 వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు చేసిన సినిమాల లిస్టులో ఈ మూవీ ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: