అక్కినేని ఇంట్లో నరకం అనుభవిస్తున్న హీరోయిన్‌ ?

Veldandi Saikiran
అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ప్రేమించుకొని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహ సమయంలో శోభిత చాలా ఆనందంగా కనిపించింది. అంతేకాకుండా తాను రెడీ అవుతున్న సమయంలో స్టెప్పులు కూడా వేసింది. వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత నాగచైతన్య సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారట.

కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి హనీమూన్ ట్రిప్ కి వెళ్లాలని ప్లాన్ లో ఉన్నారట. శోభిత కూడా సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంది. మరి ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులలో నటిస్తారా లేకపోతే ఎప్పటిలానే శోభిత సినిమాలలో నటిస్తారా అనే విషయం మీద చాలామందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపైన శోభిత ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.

ఇది ఇలా ఉండగా.... వివాహం తర్వాత శోభిత ధూళిపాళ తన అత్తారింట్లో టార్చర్ అనుభవిస్తుందని వార్తలు వైరల్ చేస్తున్నారు. తనకు నచ్చినట్టుగా వివాహానికి ముందు ఎలాంటి దుస్తులు వేసుకుందో అలానే పొట్టి బట్టలు శోభిత వేసుకుంటుందట. ఈ విషయం మీద ఇదివరకే నాగచైతన్య కాస్త సీరియస్ అయ్యాడట. సాంప్రదాయంగా దుస్తులు వేసుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారట. అయినా కూడా శోభిత ఆ మాట ఏమాత్రం వినకుండా నాకు నచ్చినట్టుగానే బట్టలు వేసుకుంటాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను అని రియాక్ట్ అయిందట.

ఈ విషయం పైన తాజాగా అక్కినేని నాగార్జున, అమల కూడా శోభితను కాస్త గట్టిగానే మందలించారట. వివాహం తర్వాత సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలని అమల, నాగార్జున అన్నారట. ఈ విషయం వల్ల శోభిత కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. నాకు నచ్చనట్టుగా నేను ఉంటాను మీకు నచ్చినట్టుగా ఎందుకు ఉండాలి అని అంటుందట. దుస్తుల విషయంలో శోభిత కాస్త నరకం అనుభవిస్తుందని సమాచారం అందుతోంది. ఇందులో ఇంతవరకు వాస్తవం ఉందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: