ప్రాణం తీసిన ప్రేమ.....ప్రియుడే అంతటికీ కారణమా....!

Suma Kallamadi
నిత్యం అనేక మంది ప్రేమ లో పడి ఆఖరికి ప్రాణాలు వదిలేస్తున్నవి చూస్తూనే ఉన్నాం. మరో విషాదం తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...... సీతాఫల్‌మండీ జోషి కంపౌండ్‌ ప్రాంతానికి చెందిన పాండు అనే వ్యక్తికి నలుగురు కుమార్తెలు. వీరిలో రెండవ కుమార్తె పూజిత (19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్‌ తో ఆమెకి  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వారు ఇరువురూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. నిత్యం పెళ్లి చేసుకోమని పూజిత ప్రదీప్ ని అడుగుతూ ఉండేది.
ఈ విషయం గురించి మాట్లాడడానికి  రాత్రి 10.30 గంటల సమయంలో సీతాఫల్‌మండీ ఫ్లైఓవర్‌ పైకి ప్రదీప్ ని రమ్మని కబురు పెట్టింది పూజిత. ఆమె చెప్పడంతో ప్రదీప్ పూజిత ని కలుసుకోవడానికి ఒక మిత్రుడి తో పాటు కలిసి వెళ్ళాడు. అక్కడ వారు  కొంతసేపు మాట్లాడుకున్నారు. ఈ మాటల్లో పూజిత ప్రదీప్ ని పెళ్లి చేసుకోమని అడిగింది. ప్రదీప్ కొంత కాలం పడుతుంది అని పూజిత కి బదులిచ్చాడు. అది విన్న పూజిత క్షణికావేశానికిలోనై పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్లి ఫ్లైఓవర్‌ పై నుంచి కిందికి దూకింది.
రాత్రి 11 గంటల సమయంలో పెద్ద శబ్ధం రాడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు చేరి చూస్తే  ఫ్లైఓవర్‌ కింద రక్తపు మడుగులో యువతి పడుంది. వెంటనే భయంతో ప్రదీప్, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న పూజితను ఆసుపత్రికి తీసికెళ్లారు.. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే పూజిత మృతి చెందింది. ఉస్మానియా మార్చురీలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రదీప్ పై కేసు నమోదు చేసారు పోలీసులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: