ఏపీ బిజేపి లో అనూహ్య మార్పులు ? కారణం ఇదే ?

ఏపీలో వైసిపి బిజెపిల మధ్య రాజకీయ వైరం తారా స్థాయికి చేరిపోయింది. ఇక్కడ ఈ రెండు పార్టీల నాయకులు అనేక అంశాలపై పొట్లాడుకుంటూ ఉంటే, జగన్ మాత్రం ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మంతనాలు చేసి బిజెపి పెద్ద ల ప్రశంసలు అందుకుని యధావిధిగా తన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడా మతపరమైన విమర్శలపైన కానీ, ఢిల్లీ టూర్ పైన కానీ స్పందించడం లేదు. ఆయన వ్యవహారం ఇలా ఉంటే, ఏపీలో బీజేపీ ఇంకా అంతర్వేది వ్యవహారంపైన , తిరుమల తిరుపతి లో జగన్ డిక్లరేషన్ అంశంపైన పదే పదే విమర్శలు చేస్తూ వస్తోంది. అలాగే. అంతర్వేది వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసిన కేంద్ర బీజేపీ పెద్దలు ఊహించనంత స్థాయిలో పార్టీకి క్రెడిట్ తీసుకు రాలేకపోయారని ఏపీ బిజెపి నేతలు అసంతృప్తితో ఉన్నారట. 


ప్రస్తుతం ఏపీలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై కేంద్ర బీజేపీ పెద్దలు దృష్టిసారించారు. అది జరగాలంటే ఏపీలో వైసిపి టిడిపి రెండు పార్టీలను దూరంగా ఉంచాలని, అప్పుడే టిడిపిలో ఉన్న అసంతృప్తులు అంతా బయటకు వచ్చి బీజేపీలో చేరతారనే ఎత్తుగడను కేంద్ర బీజేపీ పెద్దలు వేస్తున్నారు. ఇదంతా జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పై మరింతగా విమర్శల దాడి చేయాలని, అంతర్వేది వ్యవహారంలోనూ , తిరుమలలో జగన్ డిక్లరేషన్ వ్యవహారం పైన, ఏపీ బీజేపీ నేతలు గట్టిగానే పోరాటం చేసినా, అది జనాల్లోకి వెళ్లలేదని, కేంద్ర బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు గా సోము వీర్రాజు నియామకం జరిగిన కొత్తలో దూకుడుగా వ్యవహరించడం,  కొంత మంది పార్టీ నాయకులను సస్పెండ్ చేయడం వంటి వ్యవహారాలపై ఆయనతో పాటు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ థియేథర్ పాత్ర కూడా ఉందనే విషయాన్ని ఇప్పుడు అధిష్టానం పెద్దలు గుర్తించి, దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


సోము వీర్రాజు సునీల్ దియోధర్ ఇద్దరూ వైసిపికి అనుకూలంగా ఉన్నారనే అనుమానంతోనే బిజెపి కేంద్ర పెద్దలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . మరికొద్ది రోజుల్లోనే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జీ గా సునీల్ థియోదర్ స్థానంలో మరో కీలక నేతను నియమించాలని బీజేపీ అధిష్టానం పెద్దలు కసరత్తు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: