వామ్మో.. ఏకంగా టూత్ బ్రెష్ మింగేశాడు.. డాక్టర్లు ఎలా బయటికి తీసారో తెలుసా..?

praveen
మామూలుగా చిన్న పిల్లలు పొరపాటున కాయిన్స్ మింగటం  మనం చూస్తూనే ఉంటాం. అందుకే చిన్న పిల్లల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఉంటారు పెద్దలు. చిన్న చిన్న కాయిన్స్ మింగడం చిన్న చిన్న వస్తువులను మింగడం లాంటివి కూడా పొరపాటున చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం చూసి విని ఉంటాం కూడా. కానీ టూత్ బ్రష్ ని మింగడం ఎవరైనా చూసుంటారా. టూత్ బ్రష్ ని మింగడం ఏమిటి అది అసలు సాధ్యమవుతుందా అని అంటారు ఎవరైనా. ఇక్కడ జరిగిన ఘటన తెలుసుకుంటే మాత్రం ఇది ఎలా సాధ్యమైంది అని అవాక్కవుతారు ప్రతి ఒక్కరు.



 ఇక్కడ ఏకంగా ఓ వ్యక్తి టూత్ బ్రష్ మింగేశాడు. అదేమైనా రూపాయి నాణెమా  మింగేయడానికి టూత్ బ్రష్ ఎలా మింగేస్తారు అని అంటారా... అది అతనికే తెలియాలి మరి. రోజు లాగానే అతడు బ్రష్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బ్రష్ తో  గొంతుని శుభ్రం చేసుకోవాలి అనుకున్నాడు. ఇంతలో టూత్ బ్రెష్  కాస్త మింగేశాడు. ఇక ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు... చివరికి వెంటనే స్థానికంగా వున్న డాక్టర్ దగ్గరకి పరుగులు పెట్టాడు సదరు వ్యక్తి. టూత్ బ్రష్ మింగాను అంటూ చెప్పడంతో షాక్ అయిన డాక్టర్ ఎంతో కష్టం మీద ఆ టూత్ బ్రెష్  బయటకు తీసాడు.



 ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. డాక్టర్ ఏకంగా సదరు వ్యక్తి కడుపు  నుంచి టూత్ బ్రెష్  బయటకి తీసారూ. పాసీఘాట్  ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఈ నెల 15వ తేదీన రోజూ లాగానే బ్రెష్ చేసుకున్నాడు . ఇక ఈ క్రమంలోనే బ్రష్ తో  గొంతుని శుభ్రం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ పొరపాటున 9 సెంటీమీటర్లు ఉన్న బ్రష్ ని మింగేశాడు సదరు వ్యక్తి. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. బ్రష్ కడుపు లోకి వెళ్ళిపోయి.. కడుపు నొప్పి రావడం మొదలైంది. వెంటనే డాక్టర్లను సంప్రదించగా అవాక్కయిన డాక్టర్లు ఏకంగా 35 నిమిషాల పాటు సర్జరీ  నిర్వహించి  అతికష్టం మీద కడుపులోనుంచి టూత్ బ్రెష్  బయటకు తీశారు. మరీ లోతుగా బ్రష్ చేయడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: