BREAKING NEWS: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!

VAMSI
గత ఎన్నికలలో  టీడీపీ దారుణ ఓటమి తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఎన్నో పరిణామాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కూడా ఓటమిని తట్టుకోలేక మరో తెలుగు రాష్ట్రమయిన తెలంగాణలోనే ఉంటున్నారు. అయితే అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి టిడిపి నాయకులూ ఎవరూ ముందుకు రాకపోగా ఎంతో కొంత సీనియారిటీ ఉన్న వారు కూడా మొహం చాటేశారు. ఈ సమయంలో తీవ్ర సందిగ్ధంలో పడ్డ చంద్రన్నఏమీ చేయలేక హైదరాబాద్ నుండి జూమ్ మీటింగులలో నాయకులతో మాట్లాడుతూ పార్టీ కార్యాచరణను కొనసాగిస్తూ ఉన్నారు. టిడిపి నుండి ఎమ్మెల్యే గా గెలిచిన కింజరపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అధికార పార్టీకి తన దైన మాటల తూటాలతో ధీటుగా  సమాధానమిస్తూ వైసీపీ వారికి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. వారు ఎక్కడ ఏమి మాట్లాడినా దానికి కౌంటర్ ఇస్తూ అతితక్కువ సమయంలోనే చంద్రబాబుకు మంచి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టిడిపి కి అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు జోరు తగ్గడంతో పార్టీకార్యకర్తలు మరియు ఇతర ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని వారి గళం వినిపిస్తున్నారు. చంద్రబాబు కూడా అచ్చెన్ననే తదుపరి టిడిపి అధ్యక్షుడిగా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు టిడిపి కొత్త కమిటీ పై కసరత్తులు పూర్తి చేసింది. రాష్ట్రంలో టిడిపి గళాన్ని బలంగా వినిపిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు సమాచారం.

దీనికి సంబంధించిన అధికారిక వార్తను ఈ నెల 27న ప్రకటించనున్నట్టు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. మరియు చంద్రన్న రాష్ట్ర అధ్యక్ష పదవిని మళ్ళీ బిసి లకే కట్టబెట్టనున్నారు. అదే విధముగా పార్టీ కొత్త కమిటీలను మరియు వాటి నియమాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించనున్నారు. కాగా ఇటీవలే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కేసులో జైలుపాళ్ళయ్యిన సంగతి తెలిసిందే. మొదటినుండి ఆయన నన్ను అక్రమంగా ఇందులో ఇరికించారని వేధిస్తూనే ఉన్నారు. ఇప్పటికి తన జైలు జీవితం 70 రోజులు పూర్తి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: