నాని ఎంత పని చేశాడు ? వైసీపీలో అంతర్మథనం ?

frame నాని ఎంత పని చేశాడు ? వైసీపీలో అంతర్మథనం ?

మొన్నటి వరకూ, ఏపీ మంత్రి కొడాలి నాని చేసే విమర్శలకు విశేషమైన స్పందన వస్తూ ఉండేది. టిడిపి నాయకులు అందరినీ టార్గెట్ చేసుకుంటూ, వరుసగా ఆయన విమర్శలు చేస్తూ ఉండేవారు. నాని సహజ శైలిలో చేసే వ్యంగ్య విమర్శలకు , మంచి క్రేజ్ వచ్చేది. చంద్రబాబు, లోకేష్ మిగతా టిడిపి నాయకులను  వైసీపీకి  వ్యతిరేకంగా విమర్శలు చేసే వారి విషయంలోనూ నాని స్పందిస్తూ, వారి విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ. ఉండేవారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ, బిజెపి, జనసేన ,టిడిపి వంటి పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నాయి.


అంతర్వేది వ్యవహారం సైతం సిబిఐ కి అప్పగించడంతో ఇక ఈ వ్యవహారం ముగిసింది అనుకుంటున్న సమయంలో విజయవాడ కనకదుర్గమ్మ  ఆలయ రథానికి చెందిన మూడు వెండి సింహా,లు అలాగే తిరుమలలో అన్యమత ప్రచారం, ఇలా ఎన్నో వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఉండాల్సిందే అంటూ ఇప్పుడు వరకు నిబంధన ఉంటూ వచ్చింది. కానీ జగన్ ఆదేశాలతో టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆ నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఈ వ్యవహారాలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న క్రమంలో, ఏపీ మంత్రి నాని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల హిందూ దేవుళ్ళ పై జరిగిన దాడి అంశాలను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ పై అన్యమతస్తులు సంతకం పెట్టకపోతే గుడి అపవిత్రం అవుతుందా ? హిందువులు సంతకం పెట్టకపోయినా పవిత్రంగా ఉంటుందా ? అసలు ఈ డిక్లరేషన్ రూల్ ఎవరు పెట్టారు ? దీనిపై చర్చ జరగాలి. అవసరమైతే ఈ నిబంధనలు తీసివేయాలి.

ఇటువంటి నిబంధనలు కారణంగానే, కొన్ని కొన్ని వర్గాలు టీటీడీ దూరం అవుతున్నాయి .అంటూ విమర్శించారు. అక్కడితో ఆగకుండా, అంతర్వేది మొదలుకొని. అన్ని విషయాల పైన విమర్శలు చేస్తూ ఉండడం జగన్ కు సైతం ఆగ్రహం కలిగిస్తోంది అట. అదీ కాకుండా, దేవాలయాలు, దేవుళ్ళు వ్యవహారంలో ఎప్పుడూ బిజెపి యాక్టివ్ గా ఉంటుందనే విషయాన్ని సైతం మర్చిపోయి, వైసిపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం పార్టీ సైతం ఆగ్రహం కలుగుతూనే వస్తోంది. హిందూ దేవతలకు సంబంధించిన విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు కొడాలి నాని తీవ్రంగానే స్పందిస్తున్నారు.  ఇప్పుడు నాని మాట్లాడిన మాటలకు నాని సమాధానం చెప్పకపోయినా, వైసీపీ అధినేత జగన్ మాత్రం పూర్తిగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నాని వ్యాఖ్యలను వైసీపీ నాయకులే తప్పు పట్టే పరిస్థితి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: