గుడ్ న్యూస్ : టిక్ టాక్ రీ ఎంట్రీ..!

praveen
చైనా కు సంబంధించిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కి ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇతర దేశాలకు యాజమాన్యపు హక్కులు విక్రయించడమా  లేకపోతే తట్టాబుట్టా సర్దుకుని దుకాణం మూసివేయడమా  అనేది ప్రస్తుతం టిక్ టాక్ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్. భారత్ లో  నిషేధం తర్వాత అమెరికా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకొని టిక్ టాక్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక అమెరికా ప్రభుత్వం టిక్ టాక్ కి  ఇచ్చిన డెడ్ లైన్  కూడా పూర్తికావడంతో పూర్తిస్థాయిలో టిక్ టాక్ బ్యాన్ అయినట్లే అని అందరూ అనుకున్నారు. అయితే మరో వారం రోజుల పాటు టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని వాయిదా వేసింది ట్రంప్ సర్కార్.


 ఇక ఈ నిషేధం పూర్తిగా నిలిచి పోయే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం వినిపిస్తోంది. ప్రస్తుతం టిక్ టాక్ అమెరికా యాజమాన్య హక్కులను విక్రయించడానికి బైట్ డాన్స్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒరాకిల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఒప్పందంపై ట్రంపు కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తుంది. దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్వయంగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే టెక్సాస్ వేదికగా టిక్ టాక్ గ్లోబల్ అనే మరో కొత్త సంస్థను నెలకొల్పనున్నట్లు సమాచారం.


 అయితే ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో యాజమాన్యపు హక్కులు అమెరికాకు చెందిన ఓరాకిల్  సంస్థ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం టిక్ టాక్ యాప్ ద్వారా భద్రతకు సంబంధించిన భంగం కలగదు అని ధీమాతో ఉంది అమెరికా ప్రభుత్వం. టిక్ టాక్ వినియోగదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒరాకిల్ నిర్వహిస్తోందని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అనుమతులు రాగానే దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇది టిక్ టాక్ వినియోగదారులందరికీ ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: