మంత్రి కిషన్ రెడ్డి : తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు....తస్మాత్ జాగ్రత్త..!!

VAMSI
ప్రపంచంలో ఉగ్రవాదం ఎంతగా అభివృద్ధి చెందిందో మనము ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఎటువంటి లాభంలేకుండా కేవలం ఎవరో బచ్చాగాడి స్వార్ధం కోసం ఎంతోమంది అమాయకులు ఉగ్రవాదులుగా మరి అనేకమందిని పొట్టనపెట్టుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థలు కొంతమంది అమాయకులను సెలక్ట్ చేసుకుని వారికి మతం రంగు పూసి, ఇతర మతాల వారిని శత్రువులుగా చిత్రీకరించి జిహాద్ అనే మాయలో వారిని నరరూప రాక్షసులుగా మార్చేస్తారు. ఒక్కసారి టెర్రరిస్ట్ గా మారిపోయాడా అంతే ఇక ఎవ్వరు చెప్పినా వినరు...చంపడమా..చావడమా... అంతే! 2014 నుండి సిరియా, ఇరాక్‌ దేశాలపై పట్టు సాధించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. బంగ్లాదేశ్, మాలి, సోమాలియా, ఈజిప్ట్ వంటి దేశాలను తమ అడ్డాలుగా మార్చుకుని కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఐఎస్ఐఎస్.. లష్కర్-ఎ-తైబా, అల్-ఖైదా వంటి ఇతర ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఏర్పరుచుకుంది.


ఈ ఉగ్రవాదం వలన ప్రపంచంలో అనేక దుర్ఘటనలు జరిగాయి. 2011 లో ముంబై లో జరిగిన ఉగ్రదాడిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. అంత ఘోరమైన ఘటనగా చరిత్రలోకెక్కింది. అలాగే హైదరాబాద్ గోకుల్ చాట్ లో జరిగిన ఘటన ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి.  వీటన్నింటికీ కారణం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు కూడా ఉగ్రవాద ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి నిన్న రాజ్యసభలో తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దేశంలోని 12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ లిస్టులో వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయన్నారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరుతుండటంతో ఈ విషయం కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల దృష్టికి వచ్చిందని తెలిపారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించేందుకు ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాను వినియోగిస్తోందని రాజ్యసభలో తెలిపారు.


రాజ్యసభలో మరొక బీజేపీ ఎంపీ సహస్రాబుద్దే అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి పైవిధంగా తన సమాధానాన్ని ఇచ్చారు. ఇటువంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలపైన కేంద్ర భద్రతా సంస్థలు ప్రత్యేక నిఘా ఉంచాయని, అలాగే  ”వారి సామజిక మాధ్యమాల అప్ డేట్స్  పైన కూడా దృష్టి సారిస్తున్నామని, ఇలాంటివి మా దృష్టికి వచ్చిన వెంటనే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని” కిషన్ రెడ్డి తెలిపారు.తాజా ఎన్‌ఐఏ సమాచారం ప్రకారం పైన తెలిపిన రాష్ట్రాలలో ఉగ్రవాదం చురుగ్గా ఉన్నట్లు గమనించామని, అంతేకాకుండా వీటిపై ౧౭ కేసులు మరియు 122 మంది నిందుతులని కూడా అరెస్ట్ చేసారని ఆయన తెలిపారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అనుమానకరమైన సంఘటనలు చూసినా ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: