స్ప్రే రూపంలో కరోనా వ్యాక్సిన్.. విచిత్రంగా చూస్తున్న ప్రపంచ దేశాలు..?

praveen
ప్రస్తుతం చైనాలో వెలుగు లోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యం లో ఈ వైరస్ ను కంట్రోల్ చేయడం ప్రస్తుతం ఎంతో కష్టం గా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ వస్తే కానీ  వైరస్  కంట్రోల్ అయ్యే  పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కాగా ఇప్పటికే పలు దేశాల లో వైరస్  కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సిన్లు తుదిదశ పరీక్షల్లో ఉండగా.. వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది . అయితే ఇప్పటి వరకు 7 వ్యాక్సిన్లు మూడవ దశ ప్రయోగాల్లో ఉండగా అందులో చైనా కు సంబంధించిన నాలుగు ఉండటం గమనార్హం.

 ఇక అత్యవసర వినియోగం కోసం చైనా ప్రభుత్వం ఇప్పటికే  రెండు వ్యాక్సిన్ లకు అనుమతు లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే మరో వ్యాక్సిన్  వినియోగానికి కూడా అనుమతి ఇచ్చింది చైనా ప్రభుత్వం. అయితే ఈ వ్యాక్సిన్ అంతకుముందు వ్యాక్సిన్ ల  లాగా ఇంజక్షన్ ద్వారా బాడీ లోకి ఎక్కించడం వుండదు... ముక్కులోకి విరజిమ్మాల్సి ఉంటుంది. 100 మంది వలంటీర్లను రిక్రూట్ చేసుకుని ఒక నవంబర్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది చైనా.


 ప్రస్తుతం చైనా వినియోగానికి అనుమతులు ఇచ్చిన నాసల్ స్ప్రే వ్యాక్సిన్ కరోనా ను  సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హాంకాంగ్ యూనివర్సిటీ మైక్రోబయాలజీస్ట్  తెలిపారు. అయితే ఇంజక్షన్లతో పోల్చి చూస్తే ప్రస్తుతం చైనా అనుమతులు ఇచ్చిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్ ఇవ్వడం తేలికే అని చెప్పవచ్చు. అయితే చైనా ఇప్పటివరకు వరుసగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇస్తుంది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం నమ్మడం లేదు . మరి ఈ కొత్త వ్యాక్సిన్ ను  అయినా ప్రపంచం నమ్ముతుందా  లేదా అన్నది వేచిచూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: