లక్కంటే ఇతనిదే.. ఓకే సరి 20 లాటరీలు.. ఎంత గెల్చుకున్నాడో తెలుసా..?

praveen
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వస్తుంది అన్నది  కనీసం ఊహకందని విధంగా ఉంటుంది. అయితే చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంతో మంది తమ అదృష్టం మీద నమ్మకంతో లాటరీలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా లాటరీలు కొనుగోలు చేసిన వారిలో చాలామందికి అదృష్టం కలిసి వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం నిరాశే ఎదురవుతుంది. ఇక కొంతమంది సరదాగా తీసుకున్న లాటరీ కూడా అదృష్టం కలిసి వచ్చి భారీగా డబ్బులు గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.

 లాటరీలు కేవలం కోట్ల మందిలో ఒకరికి మాత్రమే అదృష్టం వరిస్తు  ఉంటుంది. ఇక ఆ అదృష్టం తమనే వరించాలి  అని ఎంతోమంది లాటరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. లాటరీ తమకే వచ్చి భారీగా డబ్బులు రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది వ్యక్తులకు ఎప్పుడో ఓసారి లాటరీ రావడం సర్వ సాధారణమైన విషయమే. కానీ ఎక్కడ ఉన్న వ్యక్తి మాత్రం నక్క తోక తోక్కినట్లే ఉన్నాడు... ఏకంగా అదృష్ట లక్ష్మి వచ్చి ఇంటి ముందు వాలిపోయింది. ఏకంగా ఇరవై లాటరీ లను గెలుచుకున్నాడు ఆ వ్యక్తి.


 వర్జీనియాలో జరిగింది ఘటన.. అతను 20 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు... కనీసం ఒక్క టికెట్ కి అయినా ప్రైస్ మనీ రాకుండా పోతుందా అని ఆశగా ఎదురుచూశాడు. కానీ అతని అదృష్టం మాత్రం భలే వరించింది. తోని  మైల్  అనే వ్యక్తి కొనుగోలు చేసిన 20 వర్జీనియా టికెట్లు కూడా గెలుచుకున్నాడు. ఒక్కో లాటరీ 3.66 లక్షల బహుమతి గెలుచుకున్నాడు. అన్ని లాటరీలు కలిపి డెబ్బై మూడు లక్షలకు పైగా గెలుచుకున్నాడు ఆ వ్యక్తి. దీంతో ఆ వ్యక్తి ఎగిరి గంతేసాడు  అని చెప్పాలి. ఒకే వ్యక్తి 20 లాటరీలు గెలవడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: