కామదాహంతో యువకుడు.. 90 ఏళ్ళ వృద్ధురాలు ఒంటరిగా ఉండటంతో..?

praveen
కామందుల బారినుంచి మహిళలకు రక్షణ లేదా.. ప్రభుత్వం తీసుకొస్తున్న కఠిన చట్టాలు న్యాయస్థానాలు విధిస్తున్న కఠిన శిక్షలు మహిళలకు రక్షణ కల్పించలేక పోతున్నాయా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది... రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకుంటుంది.  నెలలు నిండని పసికందుల నుంచి పండు ముదుసలి వరకు కామాంధుల కోరల్లో చిక్కుకుని బలి అవుతూనే ఉన్నారు. ఆడపిల్లల పై అత్యాచారం చేసిన వారికి ఎన్ని కఠిన శిక్షలు విధించినా వారిలో మార్పు మాత్రం కనిపించడం లేదు.


 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ లో 90 ఏళ్ల వృద్ధ మహిళ పై కామంతో మనిషి రూపంలో ఉన్న మృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నజఫ్  నగర్ లోని చావ్లా ప్రాంతంలో 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. సాయంత్రం సమయంలో పాలు పోసే వ్యక్తి కోసం ఆరుబయట  ఆ వృద్ధురాలు ఎదురుచూస్తుంది. దీంతో పక్కనే ఉన్న ఓ కామాంధుడు ఆ వృద్ధురాలి పై కన్నేశాడు. ఈరోజు పాల వాడు రానని చెప్పాడని.. దగ్గర్లో  పాల బూత్ ఉంది అంటూ బైక్ పై  తీసుకెళ్లాడు.  ఇక ఆ తర్వాత మాటల్లోకి దింపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించి అత్యాచారం చేశాడు.

 అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేసరికి వృద్ధురాలు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు రావడాన్ని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా వెంబడించి మరి స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తీవ్ర రక్తస్రావం ఆయన ఆ వృద్ధురాలికి సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు గా పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: