నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త.. ఇక సిద్దంకండి.!

praveen
దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ సేవలను మెరుగు పరుచుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మార్కెట్లో పోటీని తట్టుకుంటూ ఎప్పుడు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉంటుంది. అయితే వివిధ స్కీమ్ లతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు... ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కనిపిస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలో  ఉద్యోగాలు సాధించేందుకు ఎంతో మంది నిరుద్యోగులు నిరీక్షణ ఎదురుచూస్తూ ఉంటారు. కాగా తాజాగా మరోసారి నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ  ఏడాది భారీగా నియామకాలు చేపడతాము అంటూ ప్రకటన విడుదల చేయడం ప్రస్తుతం నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.



 దాదాపుగా 14000 నియామకాలు చేపడతాము  అంటూ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించాలని సంస్థ భావిస్తోందని...  అందుకే ఈ ఏడాదిలో కొత్తగా 14 వేల మందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పని చేసేందుకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు గా పేర్కొంది. నిరుద్యోగులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించింది. అయితే ఇప్పుడు వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బిఐ బ్రాంచ్ లలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 2.5 లక్షల వరకు ఉంటుంది.




 కాగా ఎస్బిఐ తాజాగా ఉద్యోగ ప్రకటన తో నిరుద్యోగులు అందరూ సిద్ధమైపోతున్నారు. ఎంతోమంది బ్యాంకులో ఉద్యోగం సాధించేందుకు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. బ్యాంకు ఉద్యోగాల పోటీ పరీక్షలకోసం సిద్ధమవుతూ ఉంటారు. కాగా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 14 వేల ఉద్యోగ నియామకాలను ప్రకటించిన నేపథ్యంలో... ఈ సారి ఎలాగైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించాలని సిద్ధమైపోయారు ఎంతోమంది నిరుద్యోగులకు. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన వార్తతో  నిరుద్యోగులు అందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: