ఏపీ లోని ఆ జిల్లాలపై కేంద్రం కీలక నిర్ణయం?
ఎప్పటికప్పుడు ప్రజల్లో కరోనా పై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. అదేవిధంగా కరోనా పాజిటివ్ వస్తే భయభ్రాంతులకు లోనుకాకుండా సకాలంలో వైద్యం తీసుకునేందుకు అంగీకరించేలా ప్రజలను ప్రేరేపించాలని తెలియజేసింది. ఇదే తరహాలో మరో ఐదు రాష్ట్రాల లోని... పదిహేను జిల్లాలలో మరిన్ని కరోనా నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడం సకాలంలో వారికి వైద్యం అందించడం....
అలాగే ప్రైమరీ కాంటాక్ట్ల వివరాలను సేకరించి వారిని క్వారంటైన్ కి తరలించడం.వారికి అన్ని రకాలైన ఆరోగ్య సదుపాయాలు అందేలా చేయడం వంటి చర్యలను మరింత ముమ్మరం చేసి... కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మరియు ముఖ్యంగా మరణాల శాతాన్ని 1 కి తగ్గేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లను, హోమ్ ఐసోలేషన్ కేసులను కట్టుదిట్టంగా పర్యవేక్షించడం, కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం, త్వరితగతిన వైద్యం అందించడం వంటి చర్యలు చేపట్టాలని కోరామన్నారు.