కొత్త కారు కొనుగోలు చెయ్యాలనుకుంటున్నారా...? ఈ స్కీమ్ ని చూసేయండి మరి...!

Suma Kallamadi
మీరు కొత్త కారుని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా...? అయితే ఇది మీకు నిజంగా శుభవార్తే. దేశీ దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకీ కొత్త స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్ తో మీరు ఎన్నో బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. ఈ పథకంలో భాగంగా కారుని కొనుగోలు చెయ్యకుండానే మీరు కారుని నడపొచ్చు అని అంటోంది సుజుకి. అయితే దీని కోసం మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ అనే స్కీమ్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది.

మారుతీ సుజుకీ కంపెనీ మైల్స్ ఆటోమొటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీతో జత కట్టడం జరిగింది. దీనితో  మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ సర్వీసులను లాంచ్ చెయ్యడం జరిగింది. కంపెనీ హైదరాబాద్, పూణే నగరాల్లో ఈ సేవలు పైలెట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ స్కీమ్‌లో భాగంగా కస్టమర్లు స్విఫ్ట్, డిజైర్, విస్తారా బ్రెజా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ వంటి మోడళ్లను లీజ్‌కు తీసుకోవ్వచ్చని కంపెనీ పేర్కొంది. అయితే  12 నెలలు, 18 నెలలు, 24 నెలలు, 30 నెలలు, 36 నెలలు, 42 నెలలు, 48 నెలల కాల పరిమితితో మీరు కొత్త కారు తీసుకెళ్లొచ్చు. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.

ఒకవేళ మీరు 48 నెలల కాల పరిమితితో కారు ఇంటికి తీసుకెళ్లాలని భావించే ఉద్దేశం ఉంటె పుణేలో 17,600, హైదరాబాద్‌లో రూ.18,350 చెల్లించాలి. ప్రతీ నెల చెల్లించాలి. ఫైనల్ గా బైబ్యాక్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల జీరో డౌన్‌‌పేమెంట్ ప్రయోజనం కలుగుతుంది. కారు మెయింటెనెన్స్ గురించి కూడా చింత అక్కర్లేదు. కంపెనీనే చూసుకుంటుంది. రోడ్‌సైడ్ సపోర్ట్ ఫెసిలిటీ 24 గంటలు ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా చాలా మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నుంచి పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రిఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కీమ్ యువతకు అనువుగా ఉంటుందని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: