అప్రమత్తం కండి.. తెరమీదకి అంతు చిక్కని వ్యాధి.. రోజుల్లోనే మృతి..?

praveen
కొన్ని రోజులుగా విశాఖ వాసులు అందరూ భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. ప్రాణాంతకమైన కరోనా  వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఎంతో మంది  ప్రాణాలను బలితీసుకుంటూ  ఉంటే... మరో వైపు వరుసగా విశాఖలో భారీ ప్రమాదాలు జరిగి  ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. దీంతో విశాఖ వాసులు అందరూ ఎప్పుడు ఎలాంటి ముప్పు వచ్చి పడుతుందోనని  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. విశాఖ మన్యంలో అంతుచిక్కని వ్యాధి ప్రస్తుతం అందరి పై పంజా విసురుతోంది.

 అంతేకాదు ఏకంగా ప్రాణాలను బలితీసుకుంటుంది . అంతుచిక్కని వ్యాధి బారిన పడి కేవలం వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలు వదలడం మరింత ఆందోళనకరంగా మారిపోయింది. మన్యం లోని  దారకొండ పంచాయతీ మారుమూల లో ఉన్న తోక రాయి లో... అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న ప్రజలు ఒక్కసారిగా శరీరమంతా వాచిపోయి.. తీవ్రంగా అనారోగ్యం పాలై రెండు మూడు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ  లక్షణాలతోనే గత రెండు మూడు రోజుల నుంచి ఇద్దరు చిన్నారులు ఓ మహిళ ప్రాణాలు  కోల్పోవడం స్థానికుల ను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.


 అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న సుశీల అనే మహిళకు శరీరం అంతా వాపులు వచ్చాయి. క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణించింది.. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది. ముందుగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా  అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం జిల్లా  ఆసుపత్రికి తీసుకెళ్లాలని  చెప్పడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది  సదరు మహిళ. ఆ తర్వాత మరో ఇద్దరు చిన్నారులు కూడా ఇదే లక్షణాలతో బాధ పడుతూ అస్వస్థతకు గురికావడం... రోజుల వ్యవధిలోనే మృతి చెందటం  జరిగింది. దీంతో గ్రామస్తులు అందరు భయాందోళనలో మునిగిపోయారు. వెంటనే మెడికల్ క్యాంప్ నిర్వహించి అందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: