అమ్మో... చైనా స్ట్రాంగ్ స్టేట్ మెంట్.. ఎంత కామెడీగా ఉంది గురూ..?

praveen
చైనా తీరు  రోజురోజుకీ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిపోతున్న విషయం తెలిసిందే. చైనా విస్తరణ వాదం... వివిధ దేశాలతో పెట్టుకుంటున్న వివాదాలు... ఆ తర్వాత చెబుతున్న శాంతి వచనాలు అన్ని చర్చనీయాంశంగానే మారిపోతున్నాయి. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య  యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గతంలో గాల్వాన్ లోయ, పాంగ్వాన్ సరస్సు భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన చైనాను  దీటుగా అడ్డుకుంది భారత్. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సైన్యాల మధ్య జరిగిన ఫిజికల్ ఎటాక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.


 అయితే చైనా ఓవైపు భారత్ ను సరిహద్దుల్లో  కవ్వింపులకి  దిగుతూనే.. మరోవైపు పైపైకి శాంతి వచనాలు వల్లిస్తున్న విషయం తెలిసిందే. కాగా  చైనా శాంతి వచనాలు  రోజు రోజుకు మరింత కామెడీ గా మారిపోతున్నాయి. ఇటీవలే  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలు అయితే... మరింత కామెడీగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. విస్తరణ వాదంతో ముందుకు వెళ్ళేది చైనా.. వివాదాలు పెట్టుకుని రెచ్చగొట్టేది  చైనా.. కానీ  ప్రస్తుతం భారత్ తమను  రెచ్చగొడుతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చైనా . ప్రస్తుతం చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారిపోయాయి


 ఎప్పుడు చైనా ఎవరి  విషయంలో కూడా చొరబాటుకి  ప్రయత్నించలేదని.. తమ దేశానికి అసలు ఇతర దేశాల సరిహద్దుల్లో  చొరబడే దుర్బుద్ధి లేదని... ఇప్పటివరకు చైనా ఏ దేశం భూభాగం జోలికి పోలేదు అంటూ తెలిపింది... కానీ ఆగస్టు 31వ తేదీన భారత్ పాంగ్వాన్  సరస్సు దక్షిణ ఒడ్డున పర్వత సమీపంలో భారత్  ఎల్ఏసి దాటిందని.. భారత్ రెచ్చగొట్టే చర్యలు మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయని..   చైనా ప్రాదేశిక సమగ్రతను భారత్ తీవ్రంగా ఉల్లంఘించింది అంటూ చైనా స్టేట్ మెంట్ ఇచ్చింది. సరిహద్దు ప్రాంతంలో శాంతి సామరస్యాలను భారత్ పాడు చేసింది  అంటూ చైనా విదేశాంగ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం ఎంతో కామెడీగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: