విశాఖపై ఆంధ్రజ్యోతి మరో సంచలనం.. అక్కడ రేప్‌లు ఎక్కువట..!?

Chakravarthi Kalyan
విశాఖ రాజధాని నగరం కాబోతుంది.. అప్పటి నుంచి విశాఖపై పత్రికల ఫోకస్ కూడా పెరిగింది. ఎల్లో మీడియాగా పేరున్న పత్రికలు కావాలని.. విశాఖలోని నెగిటివ్ పాయింట్లను హైలెట్ చేస్తున్నాయన్న వాదన ఉంది. ఆ సంగతి అలా ఉంచితే ఇవాళ ఆంధ్రజ్యోతి మరో సంచలన కథనం ప్రచురించింది. అదేంటంటే ఏపీలో విశాఖ జిల్లాలో రేపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయట.

పాలనా రాజధానికి అనువైన నగరమని సర్కారు చెబుతున్న విశాఖజిల్లాలో 180 రోజుల్లో 90 అత్యాచార కేసులు నమోదయ్యాయట. తూర్పు గోదావరి జిల్లా 85 అత్యాచార కేసులతో రెండో స్థానంలో ఉందట.  గుంటూరు జిల్లాలో ప్రతి నెల 10 చొప్పున ఆర్నెల్లలో 59 అత్యాచారాలు జరిగాయట. రేపుల విషయంలో రాష్ట్రంలోనే విశాఖ అగ్రస్థానంలో ఉందంటూ ప్రత్యేకించి నొక్కి చెబుతున్నారు. ఇక పశ్చిమ గోదావరిలో50, ప్రకాశం జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రజ్యోతిలో రోజుకు 3 రేప్‌లు పేరుతో కథనం రాగానే ఇక పసుపు శ్రేణులు కూడా విజృంభిస్తున్నాయి. ఆ కథనాన్నికోట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాయి. తెలుగు దేశం నాయకురాలు వంగలపూడి అనిత ఈ కథనం ప్రస్తావిస్తూ.. ఆరునెలల్లో 584 అత్యాచారాలు. అదేం అంటే పనికిమాలిన దిశాచట్టం పేరు చెప్పి ఎదో ఇరగతీస్తున్నాం అని గప్పాలు. లాక్ డౌన్ మూడునెలలు ఉన్నా ఈ స్థాయిలో అకృత్యాలు అది కుడా దళితులపైన 20% ఆంటే అసమర్ధ పాలనలో డొల్లతనం తెలుస్తుంది. ఒక దళిత మహిళ హోమ్ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇదేమి దౌర్భాగ్యమో.. అంటూ ఘాటుగా కామెంట్ చేశారు.

ఈ కథనంలో గణాంకాలు నిజమే అయినా.. ప్రత్యేకించి విశాఖను ఫోకస్ చేయడం.. ఇటీవల విశాఖపై ఇలా వరుసగా కథనాలు వస్తుండటం.. చూస్తే.. ఇదేదో కావాలని చేస్తున్న ప్రచారం అనిపించడంలో తప్పులేదు. అప్పడే ఏముంది.. ఇంకా ముందు ముందు ఏ కోణాల్లో విశాఖ అరాచకమో నిరూపించే కథనాలు చాలా వస్తాయి.. వెయిట్ అండ్ సీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: