ఆ వయస్సు పిల్లలకు మాస్క్ తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన...?

Reddy P Rajasekhar
భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా 70,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడకుండా మాస్క్ తప్పక ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్న పిల్లలు కూడా మాస్క్ తప్పక ధరించాలని సూచిస్తోంది. కరోనా బారిన పడకుండా 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఏ విధంగా మాస్క్ లు ధరిస్తారో 6 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు మాస్క్ లు పెట్టుకోవాలని తెలిపింది.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పేర్కొంది. చిన్న పిల్లలు మాస్క్ లను ఉపయోగించాలా...? వద్దా...? అనే విషయంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. అనారోగ్యంతో ఉన్న పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
 
అయితే ఐదేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వారి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో ప్రతిరోజూ 10,000కు అటూఇటుగా కేసులు నమోదవుతూ ఉండగా తెలంగాణలో గత 24 గంటల్లో 2,000కు పైగా కేసులు నమోదయ్యాయి.
 
రాష్ట్రంలో శనివారం 2,384 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,04,249కు చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 11 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 1855 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 9,31,839కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: