అదృశ్యమైన టీఆర్ఎస్ నేత శవమై తేలాడు.. పోలీస్ విచారణలో..?
టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్న నాగరాజు గతంలో అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. అతనికి భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాగరాజు వారిని కాదని మరో పెళ్లి కూడా చేసుకున్నారు. రెండో భార్యతో షాద్నగర్ లో కాపురం పెట్టాడు నాగరాజు గౌడ్. ఇక రెండో భార్య కు కూతురు ఉంది. అయితే రెండో భార్యను వ్యాపారాల పేరుతో తరచూ పూణే తీసుకెళ్తూ ఉండేవాడు నాగరాజు, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మొదటి భార్యను పట్టించుకోవడం.. మొదటి భార్య ఇంటికి వెళ్లడం పూర్తిగా తగ్గించాడు.
అయితే ఈ విషయాన్ని సహించలేకపోయింది మొదటి భార్య. తరచూ నాగరాజు గౌడ్ తో గొడవలు పడుతూ ఉండేది. వీరి గొడవలు ఏకంగా పోలీసుల వరకు కూడా వెళ్లాయి, ఈనెల 12వ తేదీన నాగరాజు గౌడ్ మొదటి భార్య వద్దకు రాగా అదేరోజు భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు టిఆర్ఎస్ నేత నాగరాజు. శుక్రవారం రోజున సమీపంలోని గొల్ల చెరువులో శవమై కనిపించాడు, ఇక తన తండ్రి కనిపించడం లేదంటూ రెండో భార్య కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొదటి భార్య ఇంటికి చేరుకొని అనుమానితుల వివరాలు సేకరించారు. మొదటి భార్యతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు నాగరాజ్ గౌడ్ ని హత్య చేసింది చెరువులో పడేసినట్లు ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.