ప్లాస్మా థెరపీ అనుమతులు నిలిపివేసిన అమెరికా... ఎందుకంటే...?
సాధిస్తున్న సానుకూల ఫలితాలు, చికిత్స ద్వారా కోలుకున్న రోగుల వివరాల గురించి వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ క్లినికల్ డైరెక్టర్ హెచ్, క్లిఫార్డ్ లేన్ మాట్లాడుతూ అమెరికా ఎఫ్డీఏ తీసుకున్న నిర్ణయం గురించి మీడియాతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో ప్లాస్మా థెరపీ సమీక్ష నిర్వహించిన తరువాత సమీప భవిష్యత్తులో ప్లాస్మా థెరపీకి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్లాస్మా చికిత్సకు సంబంధించిన వివరాలలో స్పష్టత లేకపోవడంతో అనుమతులు నిలిపివేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో ప్లాస్మా థెరపీ ద్వారానే కరోనా మహమ్మారిని నయం చేస్తున్నారు. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సైతం ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ప్లాస్మా థెరపీ గురించి అధ్యయనాలు నిర్వహిస్తోంది. ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇస్తుండటంతో జూలై 2న ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరి సైన్సెస్‌లో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసింది.
లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌లో కూడా మరో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటైంది. ప్లాస్మా థెరపీ గురించి రోజురోజుకు అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరిన్ని ప్లాస్మా బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది. అయితే ప్లాస్మా చికిత్స ద్వారా ఏ మేర సానుకూల ఫలితాలు వచ్చాయన్న అంశంపై వైద్య నిపుణుల్లో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ ఎడిటర్ అమర్ జేసాని ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులు కోలుకుంటున్నారని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని అన్నారు.