చైనా ను కాదని.. సౌదీ భారత్ ను ఎందుకు ప్రేమిస్తుందో తెలుసా..?

praveen
గత కొన్నేళ్ల నుంచి ప్రపంచ దేశాల చూపు మొత్తం భారతదేశం ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక దృఢమైన ఆర్థిక శక్తిగా ఉన్న చైనాను వదిలి.. భారత్ వెంట నడిచేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు సిద్ధం అయిపోతున్నాయి. ఇప్పటికే అమెరికా జపాన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దేశాలు భారత్ వెంట నడిచేందుకు... మిత్రదేశాలు గా కొనసాగేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ తో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు.. తమ తమ దేశాల ప్రయోజనాలు కూడా ఒక కారణమే అన్నది తెలిసిన విషయమే. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశంగా ప్రస్తుతం భారత్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది,

 అందుకే తమ మార్కెట్ విలువను పెంచుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి భారత్ తో  ప్రపంచ దేశాలు  సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా.. భారత్ వెన్నంటే నడిచేందుకు సిద్ధమైంది, అయితే ప్రస్తుతం నిపుణులు చెబుతున్నది ఏమిటి అంటే... రాబోయే కాలంలో భవిష్యత్తు విపత్తును  సౌదీ అరేబియా ముందుగానే గ్రహించింది కాబట్టి.. భారత్ తో  నడిచేందుకు సిద్ధమైంది అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా పూర్తిగా ఆయిల్ ద్వారా వచ్చిన సంపద తోనే  ధనిక దేశంగా కొనసాగుతుంది.

 కానీ రోజురోజుకు ప్రపంచ  పరిణామాలు మారిపోతున్న విషయం తెలిసిందే, ప్రపంచ దేశాలు మొత్తం సోలార్ గ్రిడ్ పవర్ దిశగా అడుగులు వేస్తున్నాయి, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయిల్ ఎగుమతికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతుల పైనే ఆధారపడి బ్రతుకుతున్న సౌదీ అరేబియా లాంటి దేశాలు  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. దీంతో  భవిష్యత్తు విపత్తును  ముందుగానే ఊహించిన సౌదీఅరేబియా ప్రస్తుతం భారత్ లో  వేరొక రకంగా మార్కెట్ ను మరిన్ని వ్యాపారాలను  అభివృద్ధి చేసుకునేందుకు  ప్రయత్నాలు మొదలు పెట్టిందని... అందుకే  ప్రస్తుతం భారత్ తో  సంబంధాలు నానాటికీ సౌదీ అరేబియా మెరుగు పరుచుకుంటూ ఉంది అన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా నిపుణులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: