గదిలో ఒంటరిగా యువతి.. కామంతో ఊగిపోయిన యువకులు.. ఇక రాత్రంతా..?

praveen
సమాజంలో మనుషుల కంటే కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్న వారే  ఎక్కువై పోతున్నారు నేటి సమాజంలో. ఎక్కడ చూసిన అభం శుభం తెలియని ఆడపిల్లలను కామంతో ఊగిపోయి చిదిమేస్తున్న ఘటనలే తెర మీదకు వస్తున్నాయి, ఎన్ని  కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని కఠిన శిక్షలు విధించినా ఎవరిలో భయం కనిపించటం లేదు..  ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే శిక్షలు పడతాయి  ప్రాణాలు పోతాయి అని భయం మాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


 వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకున్న వైద్య విద్యార్థినిపై ముగ్గురు  యువకులు దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు,  హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న యువతికి.. అసభ్యకర మెసేజ్ లు  పెడుతూ మానసికంగా వేధింపులకు  గురి చేశారు. ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కు తోసారూ.

 వివరాల్లోకి వెళితే... బెంగుళూరు కు చెందిన 24 ఏళ్ల యువతి ఉక్రెయిన్ లో ఎంబిబిఎస్ చదువుతోంది.  వందే భారత్ మిషన్ లో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో శంషాబాద్ కు చేరుకుంది, బెంగళూరు కు వెళ్లేందుకు ప్రైవేటు బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే కర్నూలు చెందిన విజయ్ కుమార్,  సురేందర్ కుమార్,  శంషాబాద్ కు చెందిన ప్రవీణ్ ఆ యువతి తో మాటలు కలిపారు. రాత్రి సమయంలో అమ్మాయి ఒంటరిగా ఇక్కడ ఉండటం మంచిది కాదని నమ్మబలికిన ఆ ముగ్గురు యువకులు... బస్సు వచ్చేంతవరకు వి  జె ఆర్ హోటల్ లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వారు మంచి వారే అని నమ్మిన ఆ యువతి హోటల్లో  గది అద్దెకు తీసుకుని విశ్రాంతి తీసుకుంది .

 యువతి పై కన్నేసిన ఆ ముగ్గురు కామాంధులు ఆమెపై ఎలాగైనా లైంగిక వాంఛ తీర్చుకోవాలని అనుకున్నారు. ఇక హోటల్ రిజిస్టర్ బుక్ నుంచి ఆ యువతి నెంబర్ తీసుకున్నారు. ఇక యువతికి అసభ్యకర మెసేజ్లు చేయడం మొదలు పెట్టారు . రాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు యువకులు ఆ  యువతి గది తలుపు గట్టిగా కొట్టారు. దీంతో  యువతి భయంతో వణికి పోయి బెంగళూరులోని తన అన్నకు ఫోన్ చేసింది , వెంటనే అప్రమత్తమైన సదరు వ్యక్తి హైదరాబాద్ లోని  తన స్నేహితులకు ఫోన్ చేసి తన చెల్లికి  సహాయం చేయాలని కోరాడు. ఇక వెంటనే సదరు వ్యక్తి స్నేహితులు శంషాబాద్ లోని  పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విజిఆర్  హోటల్ కు  చేరుకుని ఆ యువతిని కాపాడారు. యువతిని వేధించిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోశారు పోలీసులు,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: