షాకింగ్ ఫాక్ట్ : కరోనా మనలో 20% మందికి వచ్చిపోయిందట..!?
ఏపీ సర్కారు సిరో సర్వైలెన్స్ అనే సర్వే నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశీలించడం ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సిరో సర్వైలెన్స్‌ను ఇటీవల నిర్వహించింది.
ఈ రక్త నమూనాల్లోని యాంటీ బాడీల ఆధారంగా ఫలితాలు ఇస్తున్నారు. న్యూదిల్లీ, మహారాష్ట్రలోనూ ఇలాంటి సర్వే నిర్వహించారు. ఈ ఫలితాల ద్వారా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యుల నియామకం వంటి చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ సర్వే ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20% మందికి కరోనా సోకింది, వెళ్లింది. కానీ..ఈ విషయం వారికి తెలియదు.
ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పట్టణాలు, నగరాల్లో 30%, గ్రామీణ ప్రాంతాల్లో 70% చొప్పున వీటిని తీసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన కేసులు, వయసు, పురుషులు, మహిళలు, ఇతర ప్రమాణాల మేరకు ఈ సేకరణ జరిగింది. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, నెల్లూరు జిల్లాలో 9%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14% మంది చొప్పున వైరస్ సోకింది. కానీ వీరెవరికీ వైరస్ సోకినట్లు తగ్గిపోయినట్లు తెలియదు. కారణం వారికి ఎటువంటి అనుమానిత లక్షణాలు లేకపోవడమే.