విజయసాయిరెడ్డి మామూలోడు కాదు .. అసాధ్యుడే ?
విజయ సాయి రెడ్డి చర్యలతో సొంత పార్టీ నాయకులు కూడా ఇప్పుడు క్రమశిక్షణతో మెలుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా భూ కబ్జా ఆరోపణలపై పార్టీ నేత కొయ్య ప్రసాదరెడ్డి ని వైసిపి సస్పెండ్ చేసింది. vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి సూచనతోనే జగన్ కొయ్య ప్రసాద్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడంతో, ఎవరూ దీనిపై స్పందించ లేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ద్వారా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గ లేదనే విషయాన్ని నిరూపించుకున్నారు. అలాగే వైసీపీలో చేరేందుకు కొద్దికాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తున్న మాజీమంత్రి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు కూడా చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది.
గంటా శ్రీనివాసరావు మేనల్లుడు భూ కబ్జా వ్యవహారాలను బయటకు తవ్వి తీయడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. దీని ద్వారా తనకు వ్యతిరేఖంగా గళం విప్పుతున్నవారు ఎంతటి వారైనా, ఇదే పరిస్థితి తలెత్తుతుందనే విషయాన్ని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అలాగే జగన్ దగ్గర తన పరపతి తగ్గలేదని విషయాన్ని మరోసారి విజయసాయిరెడ్డి నిరూపించుకున్నట్టుగా కనిపిస్తున్నారు.