జగన్ సర్కార్ కి వైద్యులు రివర్స్.. ఎందుకో తెలుసా..?
ఇలాంటి నేపథ్యంలో అటు వైద్యులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి మాత్రం.. వైద్యులు జగన్ సర్కార్ పై కాస్త ఆగ్రహంతోనే ఉన్నారు అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. వైద్యులు మాత్రమే కాదు ఆసుపత్రుల నిర్వాహకులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది.. టీచింగ్ హాస్పిటల్స్ ను కూడా కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఉపయోగిస్తుంది.. అయితే వీటన్నింటికీ ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడంతో అక్కడ వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
అక్కడ వైద్యులు జీతాల విషయాలకు వచ్చేసరికి.. ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని అందుకే జీతాలు చెల్లించలేక పోతున్నామని ఆసుపత్రుల నిర్వాహకులు చెబుతుండడంతో వైద్యులు.. కరోనా సంక్షోభ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా పీపీఈ కిట్ల విషయంలో కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యులకు జీతాలు చెల్లించడం విషయంలో..పీపీఈ కిట్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.