కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్... ఆరడుగుల భౌతిక దూరంతో ఉపయోగం లేదంటున్న శాస్త్రవేత్తలు..?

Reddy P Rajasekhar
భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని చెప్పడానికి తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలామంది రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తే కరోనా సోకదని భావిస్తున్నారని ఆరడుగుల దూరం పాటించినా వైరస్ బారిన పడతామని చెబుతున్నారు.
 
ప్రస్తుతం ఉన్న మర్గదర్శకాలను సవరిస్తే మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పరిశోధన పత్రాన్ని మెడ్ రెక్సివ్ లో ప్రచురించారు. పరిశోధకులు పరిశోధనల ద్వారా గాలి ద్వారా కరోనా వైరస్ ఇండోర్ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల దూరం వరకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. గాలిలో చిన్నచిన్న తుంపర్లలోని కరోనా అణువులు అలాగే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
 
గాలి ద్వారా వైరస్ సోకే అవకాశాలు ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జనం గుమికూడే ప్రాంతాల్లోకి వెళ్లకపోవడమే మంచిది. 4.8 మీటర్ల దూరం వరకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తే ఆరడుగుల భౌతిక దూరంతో ఎటువంటి లాభం ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తొలుత గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని అభిప్రాయపడింది.
 
అయితే వివిధ దేశాల్లోని 239 మంది శాస్త్రవేత్తలు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని లేఖ రాయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి వాదనను ఒప్పుకుంది. అయితే గాలి ద్వారా కరోనా వైరస్ కు సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. మరోవైపు భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య ఇదే విధంగా పెరిగితే భారత్ లో భవిష్యత్తులో రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: