15 ప్రతిష్టాత్మక పురస్కారాలని కైవసం చేసుకున్న ఏపీ...!
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డుని అందించే భాగం లో 2020 సంవత్సరానికి గానూ ఈ– పంచాయత్ పురస్కార్ కేటగిరి– ఐఐ(ఎ)లో రాష్ట్రం రెండో స్థానంలో నిలువగా.... 8 ప.గో. జిల్లాకు సాధారణ కేటగిరి లో జిల్లా స్థాయి పురస్కారం లభించింది. ఇది ఇలా ఉండగా 8 గ్రామా అభివృద్ధికి గాను సమగ్ర ప్రణాళిక రూపొందించిన విజయనగరం జిల్లా లోని బొండపల్లి, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారం కింద తూ.గో. జిల్లాలోని చెల్లూరు , చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ అవార్డు కింద తూ.గో. జిల్లా లోని మూలస్థానంకు అవార్డులు వచ్చాయి.
ఇది ఇలా ఉండగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం , గుంటూరు జిల్లా మేడికొండూరు, చిత్తూరు జిల్లా రామచంద్రాపురం, వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరులకు జనరల్ కేటగిరికి గాను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ శశక్తికరణ్ పురస్కారాలు లభించాయి. అలానే జనరల్ కేటగిరి లో తూ.గో. జిల్లా రాయవరం మండలంలోని చెల్లూరు, ప్రకాశం జిల్లా కురిచేడు, గుంటూరు జిల్లా తెనాలి మండలం లోని కట్టేవరం గ్రామ పంచాయతీలు కూడా పురస్కారాలు దక్కించుకున్నాయి. అలానే విజయనగరం జిల్లా బొందపల్లె మండలం లోని కొండకింద, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లోని వేములకోట, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామ పంచాయతీలకు ధిమాటిక్ కేటగిరీ లో పురస్కారాలు వచ్చాయి .