ఫ్రిజ్ లో పెట్టకూడని పదార్థాలు.. అలా చేస్తే ?

Suma Kallamadi
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఆలోచించడానికి అలవాటు పడ్డారు. చదువు, ఉద్యోగం, వస్తువుల కొనుగోలు తదిరత వాటిని వారి అనుకూలంగా మలచుకుంటున్నారు. టెక్నాలజీకి అనుకూలంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పని సరిగా ఫ్రిజ్ ఉంటుంది. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలన్నీ ఫ్రిజ్ లో పెట్టడం అందరికి అలవాటుగా మారాయి. చాకెట్లు, కూరగాయలు, ఫ్రూట్స్, ఎగ్స్, మిల్స్, పెరుగు, మిగిలిపోయిన వంటలు ఫ్రిజ్ లో పెట్టేస్తుంటాం. చల్లగా ఉంటేనే ఫ్రెష్ గా ఉంటాయనే భావనలో బతికేస్తున్నాం. కానీ కొన్నింటిని మనం ఫ్రిజ్ లో పెడితే మనకే ప్రమాదం. చల్లని ప్రదేశాల్లో ఉండకూడని పదార్థాలేంటో తెలుసుకుందాం రండీ.

ప్రతి వంటకాల్లో టమాటను వాటడం కామన్. కానీ టమాటను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి పాడైపోతాయి. మెత్తగా ఉండాల్సిన టమాటలు స్ట్రాంగ్ అయి ఉబ్బుతాయి. తెలియని విషయం ఏంటంటే ఫ్రిజ్ లో టమాటను పెట్టడం వల్ల తన రుచిని కోల్పోతుంది.

కొందరు చాకెట్లను బాగా కూల్ చేసుకుని తింటుంటారు. నిజానికి వీటిని కూల్ చేసి తింటే టేస్ట్ ఉండదు. కలర్ కూడా మారిపోతుంది. క్రిస్టల్ గా తయారవుతుంది. బాగా చల్లారిన చాక్లెట్ ను తిన్నా అంత టేస్ట్ ఉండదు. చాక్లెట్ లో ముఖ్యంగా కోకో బటర్ చాకెట్లు అస్సలు ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఈ చాక్లెట్ తమ చుట్టు ఉన్న వాసనను పీల్చుకుంటాయి. దీంతో ఆరోగ్యానికి ప్రమాదమే. కేక్స్ ని అమ్మే షాపుల వాళ్లు ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ అలా చేయకుండా గాలి చేరని కంటైనర్ లో లేదా చిన్న కేక్ టిన్ పెడితే రుచి బాగుంటుంది.

బంగాళ దుంపలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి చెడిపోతాయి.  బంగాళ దుంపలను ఫ్రిజ్ లో పెట్టినప్పుడు అందులో ఉంటే పిండిపదార్థాలు షుగర్ గా మారుతాయి. అలా ఫ్రిజ్ లో పెట్టిన బంగాళ దుంపలను వండితే ఆ షుగర్ కాస్త అమైనో యాసిడ్ తో కలిసి ఎక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఆ రసాయం మన శరీరంలోకి ప్రవేశిస్తే నరాలు, కండరాలు బలహీనమవుతాయి. న్యాచురల్ హనీని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది తన సహజ గుణాన్ని కోల్పోయి చక్కెరగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: