తల్లి బీరు తాగింది.. పసికందు ప్రాణం పోయింది.. చివరికి..?

praveen
కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏకంగా  ప్రాణాలను సైతం తీస్తుంటాయి. అనుకోని విధంగా ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆ తల్లి చేసిన చిన్న పొరపాటే ఏకంగా ఆ పసికందు ప్రాణం తీసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసికందు... చివరికి ఆ తల్లి కారణంగానే కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన అందరి మనసులను కదిలిస్తుంది. బీరు తాగి పసికందు పక్కన పడుకుంది తల్లి. ఆ బీరు కారణంగానే పసికందు చనిపోతుందని ఊహించలేకపోయింది. తెల్లవారి లేచేసరికి విగతజీవిగా పడి ఉన్న పసికందును చూసి తల్లడిల్లి పోయింది ఆ తల్లి. ఈ ఘటన మేరీల్యాండ్ లో చోటుచేసుకుంది. మేరీల్యాండ్ కు చెందిన మెరియల్ మోరిసన్ అనే మహిళ... వర్చువల్ పార్టీలో రెండు బీర్లు కొంచెం మద్యం సేవించింది.

 సదరు మహిళకు నాలుగు నెలల  చిన్నారి ఉంది, ఇక మద్యం సేవించిన అనంతరం... సదరు మహిళ పసికందు తోనే పడుకుంది... పక్కనే తన నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఇక మద్యం మత్తులోనే.. పసికందుకు దగ్గరగా పడుకోవడం... డైపర్ మార్చడం.. పాలు పట్టించడం.. ఇవన్నీ చేసింది ఆ తల్లి. జాగ్రత్తగా చూసుకొని పడుకుంది. కానీ తెల్లారి చూసేసరికి ఆ పసికందులో  ఉలుకూ పలుకూ లేదు. పెదవులు మొత్తం నీలం రంగులోకి మారిపోయాయి. దీంతో ఎంతగానో టెన్షన్ పడిపోయిన ఆ తల్లి వెంటనే వైద్యులకు సమాచారం అందించారు.

 అక్కడికి చేరుకున్న వైద్యులు పసికందును పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు. అయితే బీరువాసన కారణంగానే పసికందు మరణించిందని వైద్యులు తెలిపారు. బీరు కారణంగా ఆ చిన్నారికి ఊపిరి ఆడక మృతి చెందినట్లు  నిర్ధారణ కావడంతో ఏకంగా  తల్లి పైన కేసు నమోదు చేశారు.తల్లి  నిర్లక్ష్యం కారణంగానే ప్రసికందు  మరణించింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం తెలిపింది.

కాగా అమెరికాలో ఇలా బీరు మద్యం సేవించి తమ పిల్లల  వద్ద పడుకోవడం కారణంగా ఎంతోమంది చిన్నారులు కళ్లు తెరవకముందే ప్రాణాలు వదులుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయట.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: