నేను కరోనాను ఇలా గెలిచా : ఇది కదా ఈ టైమ్‌లో అసలైన గుడ్‌న్యూస్
ఎక్కడ చూసినా కరోనా వార్తలే కనిపిస్తున్నాయి. అక్కడ అన్ని వేల కేసులు.. ఇక్కడ ఇన్ని వేల కేసులు.. అక్కడ అంత మంది మరణం.. ఇక్కడ ఇంత మంది మరణం.. ఇదీ ఏ పేపర్ చూసినా.. ఏ టీవీ చూసినా కనిపించే న్యూస్. కానీ ఇలాంటి వాతావరణంలోనూ కొన్ని గుడ్ న్యూస్ కనిపిస్తున్నాయ్.. జీవితంపై ఆశలు కల్పిస్తున్నాయి.
ఈ గుడ్ న్యూస్ ఏంటంటే... ఇప్పుడు వస్తున్న కరోనా ఎక్కువగా లక్షణాలు లేకుండానే వస్తోంది. దీన్ని ఎదుర్కోవడం చాలా సులభం అంటున్నారు కొందరు మాజీ కరోనా రోగులు. తాము ఎలా కరోనాను ఎదుర్కొన్నదీ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లింగంపల్లిలో కరోనాను గెలిచిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు.
ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిందట. ఏమాత్రం భయపడకుండా ఇంట్లోనే 20 రోజులు హోం క్వారంటైన్ ఉన్నాడట. ఇంట్లోని ఓ గదిని క్వారంటైన్ గా మలచుకున్నాడట. ప్రతి రోజు వేడి నీళ్లు, కషాయం తాగాడట. ఆవిరిపట్టాడట. డ్రై ఫూట్స్, పండ్లు, మాంసం ఎక్కువగా తీసుకున్నాడట. రోజూ వ్యాయామం చేశాడట.
అలా 20 రోజులు హోం క్వారంటైన్ ఉన్న తర్వాత పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందట. తాను ధైర్యంగా ఉన్నాను కాబట్టే కరోనాను ఎదుర్కొనగలిగాను అంటున్నాడా కరోనా విజేత. అంటే.. కరోనా వైరస్ సోకితే మరణం తప్పదని భయాందోళనకు గురి కాకూడదన్నమాట. వైరస్ బారిన పడి ధైర్యంతో ఎంతో మంది బయటపడుతున్నారు. 100మందిలో ఒక్కరు మాత్రమే మరణిస్తున్నారు. అది కూడా దీర్ఘకాలిక వివిధ రోగాలు ఉన్నవారు మాత్రమే. అందుకే ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి.