
కేసీఆర్‌కు ఇది మరో షాక్... అదే పెద్ద దెబ్బ కొట్టిందా...!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ విషయంలో అయినా ఎలా ముక్కుసూటి తనంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరిని అయినా, ఎంతటి వారిని అయినా ఆయన లెక్క చేయరు. ఇదే ఇప్పుడు ఆయనపై అనేక విమర్శలకు కారణమవుతోంది. కేసీఆర్ కరోనాకు ముందు వరకు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కరోనా ఎప్పుడు అయితే స్టార్ట్ అయ్యిందో ఆయన ముందుగానే జాగ్రత్త పడి తెలంగాణ అంతటా కఠినమైన రూల్స్‌తో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హైదరాబాద్ మహానగరం కావడంతో కేసుల జోరు ఆగలేదు. ఇక లాక్‌డౌన్ ఎప్పటి నుంచి అయితే క్రమక్రమంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది.
ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు ప్రజల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. గ్రామీణ తెలంగాణకు కూడా కరోనా జోరుగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో కరోనా విషయంలో కేసీఆర్‌పై ప్రధానమైన విమర్శలు రావడానికి ఇక్కడ కేసులకు తగ్గ రేంజ్‌లో పరీక్షలు చేయకపోవడమే. ఏపీలో వలంటీర్లు ఉండడంతో జగన్ టెస్టుల విషయంలో కేసీఆర్ కంటే చాలా ముందు ఉండడంతో పాటు దేశవ్యాప్తంగానే టెస్టుల విషయంలో ఏపీని టాప్ ప్లేసులో నిలిపారు. ఇప్పటికే కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా కేసుల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము గతంలోనే ఇచ్చిన ఆదేశాలు సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యింది. తెలంగాణలో కరోనా కేసులు, పరీక్షల విషయంలో ఇప్పటికే హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో హైకోర్టు సోమవారం వీటిపై విచారణ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల నుంచి పాత ఫార్మాట్‌లో కాకుండా కొత్త ఫార్మాట్‌లో హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయడం కూడా చాలా మందికి నచ్చలేదు. ఈ వివరాలు లేకపోవడంపై కూడా కోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది.
అక్కడితో ఆగకుండా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సీఎస్‌నే అడిగి తెలుసుకుంటామన్న కోర్టు.. ప్రైవేటు హాస్పటల్స్‌లో వైద్యానికి తీసుకుంటోన్న ఫీజులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుల నుంచి ప్రశ్నించబడడం కేసీఆర్‌కు కాస్త ఇబ్బంది లాంటిది కాగా.. ఇది ప్రతిపక్షాలకు ఊతమిచ్చేలా ఉంటుంది.