హరీష్ రావు ఓపికకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.... కరోనాను లెక్క చేయకుండా ఇంటింటికీ తిరుగుతూ....?

Reddy P Rajasekhar

మార్చి నెల తొలి వారం నుంచి దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా పేరు వినిపిస్తే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలామంది ప్రజాప్రతినిధులు పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటానికి, మీడియా ముందుకు రావడానికి కూడా రాజకీయ నేతలు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. కానీ హరీష్ రావు మాత్రం ఇతర నేతలకు భిన్నంగా ప్రజల మధ్యే తిరుగుతూ ప్రజలను కరోనా గురించి, సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. 

 


 
నిన్న సిద్ధిపేటలోని హనుమాన్‌నగర్, ఎన్టీఆర్‌ నగర్, ఇస్లాంనగర్‌ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరించి ప్రజలు ఆదివారం పది నిమిషాల సమయం తమ కోసం కేటాయించుకుంటే బాగుంటుందని సూచనలు చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని... వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని... కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 

 


 
పారిశుధ్య చర్యలు, పరిసరాల శుభ్రం, కరోనా, ఇతర విషయాల గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ డ్రైడేలో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి పది నిమిషాల పాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని అన్నారు. మంత్రి జిల్లా కేంద్రంలోని కౌన్సిలర్ల ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 

 


 
ప్రజలంతా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యతగా తీసుకుని డ్రైడేలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోందని, వైరస్ ను చూసి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంటింటికీ తిరుగ్తుతూ కీలక సూచనలు చేస్తున్న హరీష్ రావు ఓపికను ప్రజలు ప్రశంసిస్తున్నారు. మంత్రి ఓపికకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: