రైతు సంక్షేమమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం: విడదల రజిని..!

Suma Kallamadi

చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల రజిని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఫేసుబుక్ తదితర సోషల్ మీడియా సైట్లలో చురుకుగా ఉండే విడదల రజని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. అలాగే కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటారు. మాస్కు ధరించాలి, భౌతిక దూరం పాటించాలంటూ ప్రతిరోజు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేస్తుంటారు. 

 

 

సుమారు రూ.350కోట్లు ఖర్చుతో ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్రాలను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విడదల రజనీ ఫేసుబుక్ ఖాతాలో తెలిపారు. ఆర్బీకేలలో పంటల సమాచారం అంటూ రైతుల కోసం రూ. 92.2కోట్ల ఖర్చుతో తేమను కొలిచే యంత్రం, వేయింగ్ బాలెన్స్ కాలిపెర్స్, లాబ్వేర్లు కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని విడదల రజని తన ఫేసుబుక్ ఖాతాలో చెప్పుకొచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు మంచి చేసే తీరుతాం. స్వాతంత్ర దినోత్సవం రోజున 30 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేస్తుందని విడుదల రజిని తెలిపారు. 

 

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని కేవలం 48 గంటలలో ఒక 1, 07, 605 టెస్టులు చేసిందని... ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందని... ఈ విషయం అర్థం చేసుకుని ప్రజలు కూడా సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించాలని విడదల రజనీ తన ఫేసుబుక్ ఖాతాలో తెలిపారు. 21 సంవత్సరాల క్రితం ఇదే రోజున కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత మాత బిడ్డలైన ఆర్మీ జవాన్లను స్మరించుకుంటున్నానని ట్విట్టర్ ఖాతాలో విడదల రజనీ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: