భారత్ కు కరోనా ముప్పు తొలగిపోలేదు... ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ గురించి ప్రస్తావించారు. 21 సంవత్సరాల క్రితం ఈ రోజున భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో గెలిచిందని... భారత్ అప్పట్లో పాకిస్తాన్ తో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించిందని పాక్ మాత్రం కారణం లేకుండా శత్రుత్వం పెంచుకోవడానికి ప్రయత్నం చేసిందని అన్నారు. 
 
శత్రుత్వం కలిగి ఉండటం దుర్మార్గుల స్వభావం అని చెబుతారని మన్ కీ బాత్ సందర్భంగా మోదీ అన్నారు. పాక్ భారత్ భూభాగాలను ఆక్రమించడానికి ప్రయత్నించిందని అన్నారు. దేశ సమగ్రత కోసం ధైర్య సాహసాలను చూపే సైనికులకు వందనం అని.... సైనికుల శౌర్యం తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు. 


 
కరోనాపై మనం యుద్ధం చేయాల్సిందేనని మోదీ అన్నారు. మనకు కాస్త కష్టమైనా మాస్క్ ధరించాల్సిందేనని సూచనలు చేశారు. కరోనాను జయించాలంటే స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అని అన్నారు. సర్పంచులు గ్రామాలను శానిటైజ్ చేసే బాధ్యతలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పారు. 


 
ఇతర దేశాల కంటే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని... లక్షలాది మంది ప్రజల ప్రాణాలను మనం రక్షించగలుగుతున్నా కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని అన్నారు. వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని... ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచనలు చేశారు. మాస్కులు వేసుకొని గంటల తరబడి వైద్యం చేస్తున్న డాక్టర్లకు మోదీ అభినందనలు తెలిపారు. కరోనా ఎన్నో అవకాశాలను సృష్టించిందని అన్నారు. త్వరలోనే వైరస్ ను నియంత్రించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: