రైతుల సమస్య పరిష్కారం కోసం రంగంలోకి దిగిన కేసీఆర్... షాక్ లో అధికారులు....?

Reddy P Rajasekhar

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. రైతులను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ రైతుబంధులాంటి పథకాలను అమలు చేస్తారు. నియంత్రిత సాగు ద్వారా రైతులు నష్టపోకుండా ప్రయోజనం చేకూరేలా చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో పలువురు రైతులు పడుతున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చాయి. దీంతో స్వయంగా ఆయనే సమస్య పరిష్కారం కోసం రంగంలోకి దిగారు. 

 


 
సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల్లో దశాబ్దాల నుంచి భూ సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఈ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. రైతులు మంత్రులను కలిసినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. 258 మంది రైతులు 600 ఎకరాలకు దస్త్రాలు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 


 


విషయం సీఎం దృష్టికి రావడంతో కొత్తపేట, ఇటిక్యాల గ్రామ సర్పంచులతో కేసీఆర్ నిన్న రాత్రి కొత్తపేట, ఇటిక్యాల సర్పంచులతో ఫోన్ లో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు బంధు చెక్కులు అందజేస్తామని... సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. పది రోజుల తర్వాత తానే స్వయంగా వచ్చి పట్టాదారు పాసు బుక్‌లను అందజేస్తానని సర్పంచ్‌లకు తెలిపారు. 

 


 
డీఏఓ శ్రావణ్ కుమార్ గ్రామాలకు వచ్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యకు పరిష్కారం చూపిస్తారని... రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.... సర్పంచులు రైతులందరినీ కూడగట్టి సమస్యను డీఏఓకు వివరించాలని అన్నారు. సమస్య పరిష్కారమైన వెంటనే రైతు బంధు చెక్కులు వస్తాయని తెలిపారు. సర్పంచులు "సార్.... మీరు తప్పకుండా మా ఊరు రావాలని కోరుకుంటున్నాం" అని చెప్పగా మొదట కలెక్టర్ ను పంపిస్తానని.... కలెక్టర్ వచ్చిన మూడు రోజుల్లో ఎప్పుడైనా వస్తానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: