ఆ మూడు ఆంధ్రా జిల్లాల్లోనూ భూకంపం సృష్టిస్తున్న కరోనా..?

Chakravarthi Kalyan

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏ రోజు కేసుల గ్రాఫ్ కిందకు తగ్గడం లేదు. ప్రత్యేకించి.. మూడు జిల్లాలను కరోనా మహమ్మారి దారుణంగా వణికిస్తోంది. 

 

 


అలా వణుకుతున్న జిల్లాల్లో ముందు వరుసలో ఉన్నది తూర్పుగోదావరి జిల్లా.. అసలు కరోనా ఏపీలో వచ్చిన నెల రోజుల వరకూ ఈ తూర్పుగో దావరి జిల్లాలో పెద్దగా కేసులే కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ జిల్లా ఏపీ కరోనా రాజధాని కేంద్రంగా మారిపోతోంది. వరుసగా రెండు రోజులుగా రోజూ వెయ్యి కేసులు ఇక్కడ నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 

 


ఇక ఆ తర్వాత ఎక్కువగా కేసులు వస్తున్న జిల్లా అనంతపురం జిల్లా.. మొదట్లో ఇక్కడ కూడా తక్కువ కేసులు వచ్చినా.. ఇటీవలి కాలంలో జోరుగా కేసులు వస్తున్నాయి. అంతే కాదు.. ఇక్కడ వైద్యసేవలపై కూడా చాలా కంప్లయింట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో కేసుల సంఖ్య 8 వేలు దాటిపోయింది. 

 

 


తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల తర్వాత బాగా కేసులు ఉన్న జిల్లా కర్నూలు జిల్లా.. ఈ జిల్లాలో మొదటి నుంచి  కేసులు బాగానే వచ్చాయి. కానీ ఈ ఉధృతి కొన్ని జిల్లాల్లో తగ్గినా కర్నూలు జిల్లాలో మాత్రం తగ్గడం లేదు. తాజా లెక్కలతో మొత్తం 9 వేలకు పైగా కేసులతో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది. మొత్తం మీద ఉభయగోదావరి జిల్లాలు, కర్నూలు, అనంతపురం జిల్లాలు కరోనా కేసులతో హోరెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: