
పాకిస్థాన్ - చైనా మధ్య యుద్ధం.. భారత్ కి మాత్రం సంబంధం లేదు..?
చైనా... భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలను తమకు మిత్ర దేశాలుగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెట్టుబడుల ఎరచూపి ఏకంగా పాకిస్థాన్ ను తమ వైపు ఆకర్షించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి భారత్లో ఉగ్రవాదుల దాడులకు కూడా ప్రోత్సహిస్తూ వెనకనుండి నడిపిస్తూ ఉంటుంది చైనా. ఇక ప్రతి విషయంలో కూడా తెరవెనుక పాకిస్తాన్ కి అండగా ఉంటుంది చైనా. పాకిస్తాన్ అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికైనా చైనా - పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలు మాత్రం ఎప్పుడూ తొలగిపోవు. అయితే చైనా ఎలా అయితే ఇతర దేశాలను ట్రాప్ లోకి దించుతుందో ప్రస్తుతం పాకిస్థాన్ ను అలా ట్రాప్ ఉంచి ఫుల్లుగా వాడుకుంటున్నది అన్నది అందరికి తెలిసిందే.
పాకిస్తాన్ లో చైనా కు సంబంధించిన అన్ని వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ పాకిస్తాన్ వ్యాపారాలను దివాలా తీసేలా చేసి మరింతగా చైనా పై అందరూ ఆధారపడేలా వ్యూహాలను అమలు చేస్తుంది చైనా. అయితే చైనా కి ఎన్నో ఏళ్ల నుంచి మిత్రదేశంగా కొనసాగుతున్న పాకిస్తాన్ కి చైనా కి మధ్య ఇటీవలే ఓ ఆహార యుద్ధం జరిగింది, చైనా సైనికులు పాకిస్థాన్ సైనికుల మధ్య జరిగిన ఆహార వివాదం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ రెండు మిత్ర దేశాల మధ్య చిచ్చు పెట్టింది ఏమిటి అని అంటారా... అదేంటో కాదు పంది మాంసం.
ఏంటి ఆశ్చర్యపోయారు కదా... కాని ఇది నిజం.. మామూలుగా అయితే అతి గొప్ప ఇస్లామిక్ దేశం తమది అంటూ పాకిస్తాన్ చెప్పుకుంటూ ఉంటుంది. పాకిస్తాన్ లో పంది మాంసం ని అస్సలు అనుమతించారు... అదేదో నీచమైన పదార్థంగా చూస్తూ ఉంటారు అక్కడి ప్రజలందరూ. అయితే ఇటీవల చైనా కు సంబంధించినటువంటి సైన్యం పాక్ లో ఎంత వెతికినప్పటికీ.., పండి మాంసం లేకపోవడంతో పాకిస్థాన్ సైనికులతో చైనా సైనికులు ఘర్షణ దిగారట. ఇలా రెండు మిత్ర దేశాల మధ్య గొడవ సంచలనంగా మారిపోయింది.