మోదీ ప్రభుత్వ విజయాలు ఇవే : రాహుల్

praveen

దేశవ్యాప్తంగా కాంగ్రెస్  కంచుకోటలు కూలిపోతుండటంతో  కాంగ్రెస్ పరిస్థితి అయోమయంలో పడుతుంది. ఇప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి తమ చరిష్మా తో  పాలన సాగిస్తున్న కాంగ్రెస్ కి బీజేపీ భారీ షాక్ ఇస్తూ విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి పలు రాష్ట్రాల్లో భారీ విజయాలను సాధించింది. ఇక ఇప్పుడు రాజస్థాన్ ను  కూడా కైవసం చేసుకునేందుకు బిజెపి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడింది . సచిన్ పైలెట్ తో మరో 18 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడం సంచలనం గా మారిపోయింది. అయితే రాజస్థాన్ రాజకీయాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

 

 కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అగ్రనేత  అయిన రాహుల్ గాంధీ మాత్రం రాజస్థాన్ రాజకీయాలపై స్పందించలేదు. తాజాగా రాహుల్ గాంధీ రాజస్థాన్ రాజకీయాల పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రాహుల్ గాంది. ఈ మధ్య కాలంలో  తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ మోడీ సర్కారు తీరును ఎండగడుతున్నారు  రాహుల్ గాంధీ. ఇక ఇప్పుడు మోడీ సాధించిన విజయాలు అంటూ మొదలుపెట్టి... విమర్శలు గుప్పించారు. 

 

 గత కొన్ని రోజుల నుండి కరోనా కట్టడి,  చైనా సరిహద్దు వివాదం అంశాలను లేవనెత్తి  మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ తాజాగా వీటన్నింటిని కలిపి విమర్శలు చేసారు. కరోనా సంక్షోభంలో  మోడీ సర్కార్ సాధించిన విజయాలు అంటూ మొదలు పెట్టిన రాహుల్ గాంధీ..ఫిబ్రవరి: హలో ట్రంప్‌, మార్చి: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ కూల్చివేత, ఏప్రిల్‌: కరోనాపై పోరుకు కొవ్వొత్తుల్ని వెలిగించడం, మే: మోదీ సర్కార్‌కు ఆరో వార్షికోత్సవం, జూన్‌: బిహార్లో వర్చువల్‌ ర్యాలీ, జులై: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.  కాగా ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఎంతో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: