నీ వ్యసనం నా ప్రాణం తీసింది కదా నాన్న..!

Suma Kallamadi

నేడు ప్రపంచంలో మధ్యతరగతి బతుకులను మరింత చిన్నాభిన్నం చేసే మహమ్మారిలా మద్యం తయారైంది. మధ్యతరగతి కుటుంబాలు తెచ్చేదే కొంచెం సొమ్ము. దానిని ఎంతో పొదుపుగా ఖర్చు పెట్టి తింటే గాని మూడు పుట్లా మూడు ముద్దలు కడుపులోకి చేరుకోవు. కానీ  మద్యానికి బానిసగా మారిన కుటుంబ పెద్ద వచ్చిన జీవితాన్ని మొత్తం మద్యం షాపులు ఖర్చు చేస్తే మరి  కుటుంబానికి ఏమి చేరుతుంది.


సరిగ్గా అలాంటి సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. సారంగాపూర్‌ మండలం చించోలికి చెందిన సాయన్న, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద వస్తున్న ఆదాయాన్ని మద్యం షాప్ లో తగలబడుతున్నాడు. ఇద్దరు కుమార్తెలు వివాహం చేయాలి అనే స్పృహ కూడా లేకుండా మద్యానికి బానిసై కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే..సాయన్న మద్యానికి బానిస కావడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. నాలుగేళ్ల క్రితం పెద్ద కుమార్తె పెళ్లి చేశారు. సాయన్న తాగుడు అలవాటు కారణంగా పెళ్లికి చేసిన అప్పులు నాలుగేళ్లలో రూ. 20 లక్షలకు చేరాయి. దీంతో మూడెకరాల పొలాన్ని రూ.30 లక్షలకు విక్రయించి అప్పులు తీర్చేశారు. మిగతా రూ.10 లక్షలను మరో కుమార్తె పెళ్లి కోసం దాచారు.
కానీ తాగుడుకు అలవాటు పడిన సాయన్న ఆ డబ్బులను కూడా మద్యానికి ఖర్చు చేయడం ప్రారంభించాడు. కూతురు పెళ్లి చేయాలనే బాధ్యత లేకుండా వ్యవహరించసాగాడు. కొడుకు సతీష్ ఎంత చెప్పినా అతడి తీరులో మార్పు రాలేదు. ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి రూ.20 వేలు తీసుకొని బయటకు వెళ్లాడు.

 


ఎంత చెప్పినా  తండ్రి మద్యం విషయంలో మారక పోవడంతో తానే తనువు చాలించాలని నిశ్చయించుకున్నాడు. గ్రామంలో ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికైనా  సాయన్న లో మార్పు రావాలని గ్రామస్తులు, గ్రామ పెద్దలు హితబోధ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: