సీసీటీవీ ఫుటేజీ సాయంతో.. 4నెలల పాప తల్లి ఒడికి..!

Suma Kallamadi

హైదరాబాద్ లోని మంగళ్ హాట్ ప్రాంతంలో నాలుగు నెలల పాప కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కేవలం 14 గంటల్లోనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. నగరంలో 4 నెలల పాపను కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దింతో పిర్యాదు మేరకు సకాలంలో స్పందించారు. మంగళ్ హాట్ పోలీసులు 14 గంటల్లోనే నిందితులను పట్టుకుని చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.

 

 

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సీతారాంబాగ్ ప్రాంతానికి చెందిన లక్ష్మి (30)కి నాలుగు నెలల చిన్నారి రేణుక పుట్టింది. భర్తకు  ఉద్యోగరీత్య వేరే ప్రాంతాలో విధులు నిర్వర్తిస్తుడంతో తండ్రి శాంతయ్య వద్దే ఉంటూ కూతురి ఆలనపాలన చూసుకుంటుంది. ఈ నెల 11వ తేదీన (శనివారం) తెల్లవారుజామున పాప కనిపించలేదు. దీంతో లక్ష్మి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

కేసుకు సంబంధించి పోలీసులు సమీప ప్రాంతాల్లోని 30 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలించారు. చిన్నారిని ఆటోలో తీసుకెళ్తున్న ఫుటేజీ కనిపించడంతో ఆటో ఎటువైపు వెళ్లింది. ఆటో నంబర్ ప్లేట్ సాయంతో కేసుకు చేధించారు. అల్లాబండాలోని ఓ ఇంట్లో రేణుక ఉందని తెలుసుకుని పోలీసులు దాడి జరిపారు.

 


పోలీసులు నిందితులైన ఆటోడ్రైవర్ షేక్ అలీమ్(39), షేక్ సలీమ్(40)లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి రిమాండ్ లో ఉంచారు. కేసును కేవలం 14 గంటల్లో చేధించి నిందితులను పట్టుకుని పోలీసులు తల్లిని బిడ్డను కలిపారు. లక్ష్మి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి, చాకచక్యంతో నిందితులను పట్టుకుని పాపను కాపాడిన మంగళ్ హాట్ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. పాపను కాపాడినందుకు పలువురు అభినందించడం జరిగిందని మంగళ్ హాట్ పోలీసులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: