కంగారు పెడుతున్న కొత్తరకం కరోనా.... జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవా?
దేశంలో చాప కింద నీరులా శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. అయితే కరోనా వైరస్ విషయంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపించాయి. తాజాగా ఈ వైరస్ గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. లండన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వైరస్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
గతంలో శాస్త్రవేత్తలు కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పు చోటుచేసుకుంటుందని..... వైరస్ ప్రభావం తగ్గుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. తాజాగా కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులు చోటు చేసుకున్నాయని..... అందువల్ల కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన కరోనాలోని డీ614జీ స్టెయిన్ సులువుగా మనుషుల్లోకి ప్రవేశిస్తుందని సమాచారం.
ఏప్రిల్ మొదటివారం నుంచి డీ614జీ గురించి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ వైరస్ వల్ల పరిస్థితి తారుమారవుతుందని చెబుతున్నారు. . ఏప్రిల్ నుంచి కనిపిస్తోన్న ఈ ప్రత్యేక వైరస్ రకానికి ఉన్న కొమ్ముల (స్పైక్స్) ద్వారా మనుషుల కణాల్లోకి చొచ్చుకు పోతుందని.... చాలా కేసుల్లో ఈ కొత్త రకం కనిపిస్తోందని చెబుతున్నారు. శ్వాసకోస వ్యవస్థపై భాగంలో ఈ వైరస్ మనుగడ సాగిస్తోందని వాళ్లు చెబుతున్నారు.
ఈ వైరస్ వ్యాప్తిలో ప్రమాదకరంగా మారుతోందని చెబుతున్నారు. డీ614జీ వైరస్ జీనోమ్ పరివర్తన (మ్యూటేషన్) చెందిందని, ఇది ప్రవేశించిన చోటల్లా తనకనుగుణంగా పరివర్తన చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ ఆకృతిని ఉపయోగించుకుని మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది. మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.