భారత్ చైనా వివాదం : చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైన భారత్.... డ్రాగన్ విద్యుత్ పరికరాల్లో మాల్వేర్.....?

Reddy P Rajasekhar

గడిచిన 50 రోజులుగా భారత్ చైనా వివాదం గురించి ఇరు దేశాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చైనా చర్చల్లో ఒక విధంగా చర్యల్లో మరో విధంగా ప్రవర్తిస్తూ వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. భారత్ కూడా చైనాను నమ్మే పరిస్థితిలో లేదు. మాటల్లో ఒక విధంగా చేతల్లో మరో విధంగా ప్రవర్తిస్తున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. భారత్ భారీస్థాయిలో బలగాలను, యుద్ధట్యాంకులను సరిహద్దు ప్రాంతాలకు తరలించడంతో పాటు భారీగా ఆయుధాలను లడఖ్ చేరుస్తోంది. 
 
చైనా కూడా తమ సైనికులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పిస్తూ ఉండటంతో పాటు సైనికులను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. పీవోకే ప్రాంతంలో చైనా సైనికుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. చైనా అవసరమైతే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి యుద్ధం చేయాలని భావిస్తోంది. అందువల్లే గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చైనా విసృతంగా కార్యకలాపాలను సాగిస్తోంది. 
 
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సుఖోయ్, మిగ్ లను కొనుగోలు చేయడానికి భారత్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్ వాస్తవాధీన రేఖ దగ్గర చైనా యుద్ధవిమానాల కదలికలు పెరిగినట్లు గుర్తించింది. భారత్ గాల్వన్ లోయ దగ్గర గస్తీ పెంచింది. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధమైంది. మరోవైపు చైనా నుంచి దిగుమతి చేసుకునే విద్యుత్ పరికరాలు చాలా ప్రమాదం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ చైనా భారత్ మధ్య యుద్ధం వస్తే చైనా అనేక మాల్వేర్లు, ట్రోజన్ వైరస్ లను విద్యుత్ పరికరాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. చైనా మాల్వేర్లను యాక్టివేట్ చేస్తే భారత్ లోని విద్యుత్ గ్రిడ్ కుప్పకూలిపోతుందని పేర్కొన్నారు. దేశంలోని విద్యుత్ రంగాన్ని దెబ్బ తీసేందుకు చైనా ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేశారు. భారత్ ఇలాంటి విపత్తును ఎదుర్కోవడానికి ఫైర్ వాల్ ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా భారత్ లో తయారైన పరికరాలే వినియోగిస్తామని మంత్రి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: