
మంచు కొండల్లో యోగాసనాలు వేసిన భద్రత బలగాలు..!
యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగా డే ముఖ్య ఉద్దేశం. అందుకే అంతర్జాతీయంగా యోగ డే ను పత్రి సవంత్సరం జూన్ 21న నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా దేశంలో యోగ సెలెబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో నిర్వహిస్తున్నారు.
Uttarakhand: ITBP (Indo-Tibetan Border Police) personnel, deployed at India-China data-border, perform yoga at an altitude of 14000 feet at Vasudhara glacier near badrinath on #InternationalYogaDay today. pic.twitter.com/tEoNkWWtkt — ANI (@ANI) June 21, 2020
యోగా అనేది ప్రపంచానికి ఇండియా అందించి విలువైన వరం అంటారు. అయితే శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా వేదకాలం నుంచే భారతదేశంలో అమల్లో ఉందని తెలియజేశారు. 1863-1902 కాలంలో స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేశారు. యోగాలోని ఆరోగ్య ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం సూచనతో ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.
Jammu & Kashmir: CRPF (Central Reserve police Force) perform yoga in Jammu, on #InternationalYogaDay today. pic.twitter.com/WMGllvN4TH — ANI (@ANI) June 21, 2020
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ లాంటి భద్రతా బలగాలు సైతం ఉదయాన్నే యోగాసనాలు వేసి యోగా డే జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు యోగా డే నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ యోగాసనాలు వేశారు.
అయితే ఇక భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు సైతం ఉత్తరాఖండ్, లఢఖ్ ప్రాంతాల్లోని మంచు కొండలపై యోగా డే జరుపుకున్నారు. ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ ఆలయం సమీపంలోని వసుంధర మంచు కొండపై 14,000 అడుగుల ఎత్తులో సైనికులు యోగాసనాలు వేశారు. లఢఖ్ లో కూడా 18000 అడుగుల ఎత్తుగల మంచు కొండపై ఎముకలు కొరికే చలిలో జీరో టెంపరేచర్ వద్ద జవాన్లు యోగా చేశారు. మంచు కొండలో సైతం వీరు యోగాసనాలు చేసి ఔరా అనిపించుకున్నారు.