జగన్ తో చిరు బృందం భేటీ ? ఆ బృందంలో ఎవరెవరు ఉన్నారంటే ?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దన్న పాత్రలో వ్యవహరిస్తూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండ్రస్ట్రీ కి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి బృందం భేటీ అయింది. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలతో పాటు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నిబంధనలతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు చిరు ఆధ్వర్యంలోని టాలీవుడ్ బృందం ప్రయత్నాలు చేసింది.
ఈ మేరకు జగన్ జూన్ 9వ తేదీన జగన్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు చిరంజీవి ఆధ్వర్యంలోని టాలీవుడ్ బృందం సీఎం జగన్ ని కలవబోతున్నారు. ఆ బృందంలో ఫిలింఛాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్ , కార్యదర్శి దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శి ప్రసన్నకుమార్, మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి జీవిత, ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి దొరై, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు, అల్లు అరవింద్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, సుధాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్, జెమిని కిరణ్ ఇలా సుమారు 20 మంది బృందం జగన్ ను కలిసి టాలీవుడ్ సమస్యలను ఆయనకు వివరించబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే తెలంగాణలో నిబంధనలతో కూడిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంతో షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ విధంగానే ఏపీ సీఎం జగన్ కూడా షూటింగులకు అనుమతి ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.