తిరుమల భూములు ఆక్రమణ.. చేసింది స్వాములే..?

praveen

 

గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు  కు సంబంధించి కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏకంగా దేవాలయానికి సంబంధించిన ఆస్తులను వేలం వేస్తున్నారు అంటూ వార్తలు రావడం సంచలనం గా మారిపోయింది. దీనిపై అటు ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై విమర్శలు చేయడంతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ ఆస్తుల వేలం వేసే అంత దుస్థితి ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసినట్టు వంటి ఉత్తర్వులు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

 


  తిరుపతిలో ఒక మఠం  వాళ్ళు వేగంగా 1870 గజాలు ఆక్రమించగా... మరొకరు 4700 చదరపు అడుగులు ఆక్రమించారు. దీనిని క్రమబద్దీకరించాలని టీటీడీ బోర్డు సిఫారసు చేస్తే... ప్రభుత్వం ఓకే చేసింది. మామూలుగా తిరుపతిలో వివిధ మఠాలలో నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.  ఇక ఈ మఠాలకు ఏదైనా విరాళంగా డబ్బులు వస్తే వాటిని కూడా నిత్య అన్నదానం కోసం వాడుతుంటారు. అయితే తిరుపతిలో ఇలా వేలకువేలు గజాలు ఆక్రమించి మఠాలు  ఏర్పాటు చేస్తూ ఉంటే అప్పుడు ఉన్న తిరుమల తిరుపతి అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. 

 


 ముఠాలకు సంబంధించిన వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూములను అక్రమంగా ఆక్రమించుకోవటం అనేది  ఒక విచిత్రమైన అటువంటి అంశం అంటున్నారు విశ్లేషకులు. అయితే వేలకు వేలు చదరపు అడుగులు అక్రమంగా ఆక్రమించడం అనేది సాధారణ విషయం కాదని ఇది తిరుపతి లో ఏదైనా కుంభకోణాల కారణంగా జరిగిందా.. దీనికి కారణం మరొకటా  అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అయితే తిరుపతి దేవస్థానం సంబంధించిన భూములు వేల గజాల ఆక్రమణలకు గురయ్యాయని తాజాగా టీటీడీ బోర్డు తెలపడంతో ఇది కాస్త  సంచలనంగా మారిపోయింది. మరి దీనిని  తేల్చే వారు ఎవరు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/Jdmzm9mj4og" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: