సరిహద్దు వివాదంపై చైనా తెగింపు వెనుక అసలు కారణాలివే...?

Reddy P Rajasekhar

చైనా భారత్ సరిహద్దు వివాదం గురించి గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సరిహద్దు వివాదం విషయంలో చైనా ఎంతకైనా తెగిస్తోంది. చైనా సరిహద్దుకోసం ఈ వివాదం మొదలుపెట్టలేదని... మరికొన్ని కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా భారత్ పై ఆధిపత్యం చలాయించాలనే భావనతో ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కొన్ని నెలల క్రితం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు పాకిస్తాన్ కారణం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చైనా పాక్ వెనుక ఉండి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. భారత్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఇక్కడి మ్యానుఫాక్టరింగ్ కంపెనీలు చైనాకు తరలివచ్చే అవకాశం ఉందని డ్రాగన్ దేశం భావిస్తోంది. భారత్ ను దెబ్బ కొట్టడం కోసం పాక్ తో కలిసి చైనా ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ మధ్య కాలంలో చైనా సైనిక బలగాలు భారత్ లోకి చొచ్చుకుని ఆక్రమించే ప్రయత్నం చేశాయని వార్తలు వస్తున్నాయి. 
 
మన దేశానికి నాసిరకం వస్తువులను పంపిస్తూ మన దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే ప్రయత్నం కూడా చైనా చేస్తోంది. పాక్ కశ్మీర్ ను కోరుకోవడానికి కూడా చైనానే కారణమని తెలుస్తోంది. నిజానికి చైనా పడమర వైపు ఉన్న సముద్రాలను అస్సలు పట్టించుకోదు. పడమర వైపు ఉన్న సముద్రమార్గం ద్వారా రవాణా చేయాలంటే భారత భూభాగం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. 
 
పాకిస్తాన్ కు చైనాకు బోర్డర్ కలావాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే మార్గం. పాకిస్తాన్ లోని గోధర్ అనే ప్రదేశం మస్కట్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒమన్ పర్షియన్ దేశాలకు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాల నుంచే గల్ఫ్ ఆయిల్ నిక్షేపాల రవాణా జరుగుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ చైనా చేతిలో ఉంటే మాత్రమే ఇవి అన్నీ సాధ్యమవుతాయి. చైనా భారత్ లో ఘర్షణలు సృష్టించి పాక్ అక్రమిత కశ్మీర్ ను మనం ఆక్రమించకుండా సరిహద్దు వివాదాలను సృష్టిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: